మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. వజ్రాల బ్లౌజ్‌తో మెరిసిపోతూ..
మెట్ గాలా 2026లో ఇషా అంబానీ భారతీయ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటారు. గౌరవ్ గుప్తా రూపొందించిన పిచ్వాయ్ కళాఖండాలతో కూడిన చీర, నీతా అంబానీ సేకరణలోని 1800 క్యారెట్ల వజ్రాలు, 'సర్ పేచ్' ఆభరణాలతో ఆమె మెరిశారు. అంతర్జాతీయ వేదికపై దేశీయ ఫ్యాషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారుతున్న ఇషా లుక్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు.
అంతర్జాతీయ ఫ్యాషన్ వేదిక మెట్ గాలా 2026లో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ తన అద్భుతమైన వస్త్రధారణతో భారతీయ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పారు. ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన చీరకట్టులో ఆమె మెరిసిపోయారు. ఈ చీరపై చేత్తో చిత్రించిన ‘పిచ్వాయ్’ కళాఖండాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో ఇషా ధరించిన బ్లౌజ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా 1800 క్యారెట్ల వజ్రాలు, ఎమరాల్డ్స్ , పోల్కీ నగలతో దీనిని రూపొందించారు. దీనికి తోడు, తన తల్లి నీతా అంబానీ కలెక్షన్‌లోని నిజాం కాలపు అరుదైన ‘సర్ పేచ్’ ఆభరణాన్ని ఆ బ్లౌజ్‌లో చేర్చడం ద్వారా ఒక చారిత్రాత్మక మెరుపును అద్దారు. ఈ ఆభరణాలన్నీ తన తల్లి నీతా అంబానీ కలెక్షన్ లోనివని ఇషా చెప్పారు. ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన చీరలో ఆమె మెరిసిపోయారు. ఈ చీరపై చేత్తో చిత్రించిన ‘పిచ్వాయ్’ కళాఖండాలు, ‘స్వదేశ్’ కళాకారులు స్వచ్ఛమైన బంగారు తీగలతో నేసిన అంచు భారతీయ హస్తకళల గొప్పతనాన్ని చాటిచెప్పాయి. వీటికి అదనంగా, సుబోధ్ గుప్తా రూపొందించిన బ్యాగ్‌లో మామిడి పండును పట్టుకోవడం, ఇత్తడితో చేసిన ‘గజ్రా’ను తలలో అలంకరించుకోవడం ద్వారా భారతీయ మూలాలను అద్భుతంగా ప్రతిబింబించారు. గత మూడేళ్లుగా రాహుల్ మిశ్రా, అనామికా ఖన్నా వంటి భారతీయ డిజైనర్ల దుస్తులనే ధరిస్తూ, అంతర్జాతీయ వేదికలపై భారతీయ ఫ్యాషన్‌కు ఇషా అంబానీ ఒక బలమైన బ్రాండ్ అంబాసిడర్‌గా మారుతున్నారు. ఈ రాయల్ లుక్ చూసి నెటిజన్లు “భారతీయ వారసత్వానికి అసలైన నిదర్శనం” అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Thalapathy Vijay: బక్కచిక్కిన కుర్రాడు టూ CM.. చరిత్ర సృష్టించడం అంత సులువు కాదు
Varanasi: సినిమా షూటింగ్ కోసం 150ట్యాంకర్ల డ్రింకింగ్ వాటరా..? జక్కన్నకు వాటర్ బోర్డ్ ఝలక్
Jana Nayagan: జననాయగన్ సినిమా పేరు మారుతుందా ??
Fauzi: ప్రభాస్ ఫౌజీ సినిమా టీంకు ప్రమాదం.. షూటింగ్‌కు బ్రేక్!
TVK Vijay: అప్పుడు NTR, ఇప్పుడు విజయ్! బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది..