దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్ అవుతున్న ప్రత్యేక వంటకం
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ అందిస్తున్న ‘దాల్ విస్కీ’ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంప్రదాయ దాల్ మఖనీకి విస్కీ ఫ్లేవర్ జోడిస్తూ ఈ ఫ్యూజన్ డిష్‌ను తయారు చేస్తున్నారు. టేబుల్ వద్ద వేడి నెయ్యి, ఎండుమిరపకాయలతో తాళింపు చేసి, అందులో విస్కీ పోయడంతో మంటలు చెలరేగుతాయి. ఆ ఫ్లేమింగ్ తాళింపును దాల్ మఖనీలో కలిపి వేడి కుల్చాలతో సర్వ్ చేస్తున్నారు. దీనిపై నెటిజన్ల స్పందన మిశ్రమంగా ఉంది.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల ఫుడ్ ప్రయోగాలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా భాగ్యనగరంలో ఓ వినూత్న వంటకం ఫుడ్ లవర్స్ దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ అందిస్తున్న ‘దాల్ విస్కీ’ అనే ఫ్యూజన్ డిష్ ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఉత్తర భారతదేశానికి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ వంటకం ‘దాల్ మఖనీ’కి ఆల్కహాల్ ఫ్లేవర్ జోడించి ఈ ప్రత్యేక డిష్‌ను తయారు చేస్తున్నారు. అయితే దీనిని తయారుచేసే విధానమే కస్టమర్లను మరింత మంత్రముగ్ధులను చేస్తోంది. ముందుగా దాల్ మఖనీని సిద్ధం చేసి, నేరుగా డైనింగ్ టేబుల్ వద్దకే తీసుకొస్తారు. ఆ తర్వాత వేడిగా ఉన్న స్వచ్ఛమైన నెయ్యి, ఎండుమిరపకాయలతో తాళింపు సిద్ధం చేసి, అందులో రెస్టారెంట్ సిగ్నేచర్ విస్కీని కొద్దిగా పోస్తారు. దాంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతాయి. ఆ మంటలతో కూడిన విస్కీ తాళింపును నేరుగా దాల్ మఖనీలో వేసి వేడివేడి కుల్చాలతో సర్వ్ చేస్తున్నారు. ఈ వినూత్న వంటకం తయారీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఈ క్రియేటివిటీని ప్రశంసిస్తూ “భారతీయుల ఆవిష్కరణలు అద్భుతం” అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం సంప్రదాయ వంటకం రుచి పాడవుతుందని, పప్పులో విస్కీ వేసే బదులు తాగడమే మేలంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఏది ఏమైనా, ఈ ‘దాల్ విస్కీ’ ప్రస్తుతం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్ న్యూస్.. ఇక పురుషులకూ ఫ్రీ బస్ సదుపాయం
ఆ ఆలయంలో అంతుచిక్కని దైవ రహస్యం..
గుడ్‌న్యూస్.. హెచ్-1బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజుకు బ్రేక్
గుడ్‌న్యూస్.. ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్ వచ్చేసింది.. రోజువారీ, నెలవారీ ధరలివే!
ప్రయాణికుడి దుస్సాహసం.. టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం!
