కుక్క కోసం రూ. 15 లక్షలు.. ఖర్చు చేసారు.. చివరికి..
హైదరాబాద్ కుటుంబం తమ కుక్కను ఆస్ట్రేలియాకు తరలించడానికి రూ.15 లక్షలు ఖర్చు చేసింది. భారతదేశం నుండి నేరుగా అనుమతి లేకపోవడంతో, ఆరు నెలలు దుబాయ్‌లో ఉంచి, ఆపై ఆస్ట్రేలియాకు తీసుకెళ్లారు. డబ్బు మళ్లీ సంపాదించవచ్చని, కానీ కుక్కతో అనుబంధం వెలకట్టలేనిదని ఆ దంపతులు తెలిపారు. స్కై తమ బిడ్డ లాంటిదని, ఈ ఖర్చు, శ్రమ తమకు సంతోషాన్ని ఇచ్చాయని చెప్పారు. వారి త్యాగాన్ని ఇప్పుడు అంతా మెచ్చుకుంటున్నారు.
కుక్కను ఆస్ట్రేలియా తీసుకెళ్లేందుకు 15 లక్షల రూపాయలు ఖర్చు చేసింది ఓ హైదరాబాద్ ఫ్యామిలీ. ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. కుక్క కోసం ఇంత ఖర్చు చేయడమేంటి బ్రో.. కొత్త కుక్కను కొనొచ్చుగా..? అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అన్ని డబ్బులు పెడితే ఒక్క కుక్కేంటి..? వందల కుక్కలు కొనొచ్చు అంటూ ట్రోల్ చేస్తున్నారు. కానీ ఆ కపుల్ చెప్పిన సమాధానం విని అంత ఖర్చు చేయడంలో తప్పులేదు అంటున్నారు. వాస్తవానికి ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు కుక్కలను డైరెక్ట్‌గా తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. కనీసం 6 నెలలు రేబీస్ లేని దేశంలో ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ఆస్ట్రేలియాకు అనుమతిస్తారు. ఇందుకు కనీసం 14 నుంచి 16 లక్షల రూపాయల ఖర్చవుతుంది. అయితే చాలా మంది అంత ఖర్చు చేయడమెందుకు అన్నారట. కానీ వీళ్లు చెప్పిన మాటలు ఆలోచింపచేసేలా ఉన్నాయి. డబ్బును మళ్లీ సంపాదించవచ్చు. కానీ కుక్కతో అనుబంధాన్ని కొనలేము. మళ్లీ సంపాదించలేము అని చెప్పారట. ఆరు నెలలు కుక్కను దుబాయి లో ఉంచి.. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు తీసుకెళ్లినట్లు పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఆస్ట్రేలియా వెళ్లే ముందు ఆరు నెలలు దుబాయిలో గడపాల్సి వచ్చింది. రోజులు లెక్కపెడుతూ అక్కడ ఉన్నామని తెలిపింది ఆ జంట. ఎన్నో ఫోన్లు, వీడియో కాల్స్.. నెలల తరబడి వేదనను భరించి.. చివరికి ఆస్ట్రేలియాకు వెళ్లామని చెప్పారు. స్కై కేవలం కుక్క కాదు. అది తమ బిడ్డ లాంటింది. దాని కోసం ఇలాంటి ఖర్చు, శ్రమ ఎన్నిసార్లైనా చేస్తాం అంటూ పోస్ట్ చేశారు. ఈ స్టోరీ తెలియని వాళ్ళు మొదట్లో వేరేలా కామెంట్స్ చేసినా.. ఆ తర్వాత తమను మెచ్చుకున్నట్లు హైదరాబాద్ జంట తెలిపారు. ఆరు నెలలు వెయిట్ చేసి కుక్కను తీసుకెళ్లడం చాలా గొప్ప విషయం అంటూ కొందరు మీలాంటి వాళ్లు ఉండటం స్కై చాలా లక్కీ అంటూ మరి కొందరు ఖర్చు ఎక్కువైనప్పటికీ.. వర్త్ ఫుల్ అంటూ ఇంకొందరు కామెంట్స్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Union Budget 2026: తెలుగు రాష్ట్రాలకు లాభమా? నష్టమా? నిర్మలమ్మ లెక్కలు ఇవే
Budget 2026: ఇల్లు కొనేవారికి ఊరట ఏది? రామిరెడ్డి విశ్లేషణ ఇదే
Anil Ravipudi: అనిల్ రావిపూడికి ఊహించని ప్రమోషన్