Hundreds of monkeys: బాహుబలి యుద్ధాన్ని మించిన కోతుల యుద్ధం.. వందలాది వానరాలు ఒకేసారిగా..!

|

Aug 14, 2022 | 8:47 PM

సాధారణంగా మనుషుల గ్యాంగ్ వార్ గురించి విన్నాము.. చూశాము. కానీ, కోతుల మధ్య గ్యాంగ్ వార్ ఎప్పుడైనా చూశారా? పోనీ విన్నారా? లేదా? అయితే ఇప్పుడు చూసేయండి. పదీ ఇరవై సంఖ్యలో కాదు..


సాధారణంగా మనుషుల గ్యాంగ్ వార్ గురించి విన్నాము.. చూశాము. కానీ, కోతుల మధ్య గ్యాంగ్ వార్ ఎప్పుడైనా చూశారా? పోనీ విన్నారా? లేదా? అయితే ఇప్పుడు చూసేయండి. పదీ ఇరవై సంఖ్యలో కాదు.. ఏకంగా వందల సంఖ్యలో గుమిగూడిన కోతుల మంద, రెండు గ్రూపులుగా ఏర్పడి చిన్నపాటి యుద్ధమే చేశాయి. అనంతరం రెండు గ్రూపుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.ఈ విచిత్ర సంఘటన మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర గ్రామంలో చోటుచేసుకుంది. వనాలు తగ్గిపోతుండటంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆహారం, నీరు దొరక్క గ్రామాలపై దండెత్తుతున్నాయి. అలా పెద్దవంగర గ్రామంలో చొరబడ్డ వందలాది కోతులు ఆహారం కోసం తమలో తామే కొట్టుకున్నాయి. ఏయ్‌..బిడ్డా ఇది నా అడ్డా.. అన్నట్టుగా రెండు గ్రూపులుగా విడిపోయి గ్యాంగ్‌వార్‌కు దిగాయి. పరస్పరం దాడులు చేసుకున్నాయి. దాదాపు మూడు గంటల పాటు కోతుల యుద్ధం కొనసాగింది. ఈ సన్నివేశం చూసిన స్థానికులు భయంతో హడలిపోయారు. ఇళ్లకు తలుపులు వేసుకుని.. కిటికీలోంచి వాటి యుద్ధాన్ని వీక్షించారు. కోతుల గొడవను కొందరు ధైర్యం చేసి తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us on