Horse Hair Style: పిచ్చి పీక్స్‌కి చేరడమంటే ఇదే.. నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో..

|

Jul 13, 2022 | 8:50 AM

ఫ్యాషన్ ప్రపంచంలో ఏం చేయడానికైనా ఫ్యాషన్ ప్రేమికులు సిద్ధంగా ఉంటారు. మంచి బట్టలు, హెయిర్ స్టైల్, ఫుట్ వేర్, ఇలా ఏ చిన్న మార్పు అయినా విభిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు.


ఫ్యాషన్ ప్రపంచంలో ఏం చేయడానికైనా ఫ్యాషన్ ప్రేమికులు సిద్ధంగా ఉంటారు. మంచి బట్టలు, హెయిర్ స్టైల్, ఫుట్ వేర్, ఇలా ఏ చిన్న మార్పు అయినా విభిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో హెయిర్ స్టైల్ కోసం యువకులు ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. తాజాగా ఒక వ్యక్తి వింత స్టైల్‌లో జుట్టు కత్తిరించుకునే వీడియో వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు పగలబడి నవ్వడం పక్కా.ఇందులో ఓ యువకుడు తన జుట్టును గుర్రం ఆకారంలో కటింగ్‌ వేయించుకుంటున్నాడు. అతని హెయిర్‌కట్‌ను చూస్తుంటే, అతని తలపై నిజంగా చిన్న గుర్రం నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది. స్పెషాలిటీ ఏంటంటే.. హెయిర్ కి హార్స్ స్టైల్ ఇవ్వడానికి ఎలాంటి కలర్ వాడలేదు. కేవలం జుట్టును మాత్రమే ఎంతో చాకచక్యంగా గుర్రం ఆకారంలో కత్తిరించారు. ప్రపంచంలో కొంతమంది కొత్తగా ఏదైనా చేయాలనే మక్కువతో ఉండేవారు ఇలాంటి వెరైటీలకు పాల్పడుతుంటారు. ఈ ఫన్నీ వీడియో ఓ యూజర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ 12 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 5 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. వేలల్లో లైక్‌ చేశారు. వివిధ రకాల రియాక్షన్లు ఇస్తున్నారు. ఆ వ్యక్తి హెయిర్‌స్టైల్ అద్భుతంగా ఉందని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం అతడిని చూసి నవ్వుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Follow us on