బీచ్‌ ఒడ్డుకు కొట్టుకు వచ్చిన భారీ తిమింగలం.. స్థానికులు ఏం చేశారో చూడండి!

Updated on: Nov 12, 2026 | 11:46 AM

గోవాలోని మంద్రెమ్ బీచ్‌లో భారీ తిమింగలం అనుకోకుండా ఒడ్డుకు కొట్టుకొచ్చింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన దృష్టి లైఫ్‌సేవర్ గ్రూప్ సిబ్బంది ఎంతో చాకచక్యంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. తిమింగలం శరీరానికి వస్త్రాలు చుట్టి, నీటిని చల్లుతూ సురక్షితంగా సముద్రంలోకి పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూగజీవి ప్రాణాలు కాపాడిన సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సముద్రంలో స్వేచ్ఛగా విహరించాల్సిన ఓ భారీ తిమింగలం అనుకోకుండా ఒడ్డుకు కొట్టుకొచ్చింది. దీనిని గమనించిన స్థానిక రెస్క్యూ సిబ్బంది అప్రమత్తమైంది. అతి కష్టం మీద దానిని సురక్షితంగా కాపాడి తిరిగి సముద్రంలోకి పంపించారు. ఈ ఘటన గోవాలో జరిగింది. గోవాలోని ప్రముఖ మంద్రెమ్ బీచ్‌లో ఆదివారం మధ్యాహ్నం భారీ పరిమాణంలో ఉన్న ఒక తిమింగలం అనుకోకుండా ఒడ్డుకు కొట్టుకువచ్చింది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే ‘దృష్టి లైఫ్‌సేవర్ గ్రూప్’ సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఆ సముద్ర జీవి భారీ బరువుతో ఉండటంతో తొలుత దానిని కదిలించడం సాధ్యం కాలేదు. దీంతో సిబ్బంది ఎంతో చాకచక్యంగా దాని శరీరానికి పెద్ద వస్త్రాలను చుట్టి, తడిసేలా నీటిని చల్లుతూ జాగ్రత్తగా సముద్రం వైపు లాకెళ్లారు. అతి కష్టం మీద దానిని సురక్షితంగా లోతైన జలాల్లోకి చేర్చడంతో అది సంతోషంగా ఈదుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, మూగజీవి ప్రాణాలు కాపాడిన సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, గతంలో ముంబై తీరంలో ఇలాంటి ఘటనే జరిగినప్పటికీ తగిన స్పందన లేక తిమింగలం మృతి చెందింది. కానీ, మంద్రెమ్ బీచ్‌లో మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ జీవికి పునర్జన్మ ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డబ్బులు ఆదా చేద్దామని రైలెక్కాడు.. చివరకు లబోదిబోమంటూ..

Loading...
Unable to load recommendations.
Follow Us