Car wash: వామ్మో.. కారును వాష్ చేయమని ఇస్తే.. మెకానిక్ చేసిన పని ఏంటో తెలుసా.?
ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో చెప్పడం ఎవరితరం కాదు. ఊహించని ప్రమాదాలు కొన్ని సార్లు వణుకు పుట్టిస్తే మరికొన్ని నవ్వులు పుయిస్తాయి. నెట్టింట యాక్సిడెంట్ వీడియోలకు కొదవేలేదు.
ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో చెప్పడం ఎవరితరం కాదు. ఊహించని ప్రమాదాలు కొన్ని సార్లు వణుకు పుట్టిస్తే మరికొన్ని నవ్వులు పుయిస్తాయి. నెట్టింట యాక్సిడెంట్ వీడియోలకు కొదవేలేదు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే అస్సలు నవ్వు ఆపుకోలేరు. సర్వీసింగ్‌కు ఓ వ్యక్తి తన కారును తీసుకొని వచ్చాడు. వాషింగ్ కోసం ఓ బేస్ మెంట్‌ను కారు ఎక్కించాలని అక్కడ ఉన్న వ్యక్తి సూచించాడు. దాంతో అతడు కారును బేస్మెంట్ పైకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. అక్కడ ఓ వ్యక్తి నిర్దేశిస్తుంటే కారును పైకి ఎక్కించబోయాడు. అయితే ఆ తర్వాత కారును ఆపమని అతడు ఎంత చెప్తున్నా వినకుండా కారు ఎక్సలేటర్‌ను గట్టిగా తొక్కాడు. దాంతో కారు కంట్రోల్ తప్పి ముందు ఉన్న గోడను గుద్దేసింది. దాంతో కారు డ్యామేజ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?