చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్..
హర్యానాలోని ఫరీదాబాద్‌లో, అశోక్ శర్మ కుటుంబం పొరపాటున రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చెత్తతో పాటు స్క్రాప్ డీలర్ ఖాన్‌కు అమ్మేసింది. నెలల తర్వాత ఖాన్ ఆ నగలను గుర్తించి, ఏమాత్రం ఆశపడకుండా పోలీసుల ద్వారా యజమానికి తిరిగి అప్పగించాడు. ఈ నిజాయితీకి పోలీసులు, కుటుంబ సభ్యులు ఖాన్‌ను అభినందించారు. ప్రస్తుత కాలంలో ఇలాంటి నిజాయితీ పరుడు దొరకడం అరుదు.
హర్యానాలోని ఫరీదాబాద్‌లో నివాసం ఉండే అశోక్ శర్మ కుటుంబం గతేడాది దీపావళికి తన ఇంటిని శుభ్రం చేయించారు. పాత సామాన్లను స్క్రాప్ డీలర్ ఖాన్‌కు అమ్మేసారు. దురదృష్టవశాత్తు 15 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న కవర్‌ను కూడా చెత్తతో పాటే స్క్రాప్ డీలర్‌కు అమ్మేశారు. ఇంట్లో నగలు కనిపించకపోవడంతో అశోక్ శర్మ కుటుంబం కంగారు పడింది. గతేడాది కుంభమేళాకు వెళుతూ నగలను కవర్‌లో పెట్టి పాత సామాన్ల మధ్య దాచుంచారు. అన్నీ వెతికాక.. అవి స్క్రాప్ డీలర్‌కు ఇచ్చిన చెత్తలో పోయాయని గుర్తొచ్చి ఖాన్‌ను సంప్రదించారు. దీంతో ఖాన్ కూడా విపరీతంగా వెతికాడు. కుటుంబ సభ్యుల ముందే తుక్కును మొత్తం తీసి చూసాడు ఎక్కడా కనిపించలేదు. నగలపై ఆశ వదులుకున్న అశోక్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెలలు గడిచాక అద్భుతం జరిగింది. ఖాన్ తన వద్ద ఉన్న భారీ చెత్త ను వేరు చేస్తున్న సమయంలో ఒక ప్లాస్టిక్ కవర్‌ను గుర్తించాడు. దాన్ని విప్పి చూడగా అందులో మెరిసిపోతున్న బంగారు ఆభరణాలు కనిపించాయి. రూపాయి దొరికితేనే జేబులో వేసుకుని నిశ్శబ్దంగా వెళ్లిపోయే మనుషులున్న ప్రస్తుత కాలంలో.. ఏకంగా రూ.15 లక్షల విలువైన బంగారాన్ని చూసి కూడా ఏమాత్రం ఆశ పడలేదా వ్యక్తి. తనకు ఓ యజమాని అమ్మిన చెత్తలో వచ్చిన బంగారు నగల సంచిని.. నాలుగు నెలల తర్వాత గుర్తించాడు. దాచుకుంటే ఎవరికీ తెలిసే అవకాశమే లేకపోయినా.. ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ నగలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు ఖాన్. అప్పటికే నమోదైన కేసు ఆధారంగా పోలీసులు అశోక్ శర్మ కుటుంబాన్ని స్టేషన్‌కు పిలిపించారు. ఖాన్ చేతుల మీదుగానే ఆ బంగారు ఆభరణాలను యజమానికి అందజేశారు. అప్పటి వరకు నగలు ఏమయ్యాయో తెలియక లబోదిబోమన్న ఆ కుటుంబ సభ్యులు మాత్రం.. స్క్రాప్ డీలర్ నిజాయితీని చూసి తెగ సంబరపడిపోయారు. ఈ కాలంలో ఇంతటి నిజాయతీ పరుడిని చూడటం గొప్ప విషయమని పోలీసులు ఖాన్‌ను సత్కరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాబోయ్.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
