ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి రూ. 1.50 లక్షల టోకరా.. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
తిరుపతిలో ఐపీఎస్ అధికారిగా నటిస్తూ నిరుద్యోగులను మోసం చేసిన కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సురేష్ కుమార్ అనే వ్యక్తి సుమారు రూ. 1.5 లక్షలు వసూలు చేసి ప్రభుత్వ ఉద్యోగాల ఆశ చూపాడు. అలిపిరి పోలీసులు నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నమ్మవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు. మోసపోతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో హైటెక్ మోసం వెలుగుచూసింది. ఐపీఎస్ అధికారిని అంటూ నమ్మించి, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ముంచేస్తున్న ఒక కేటుగాడిని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ గా ఉంటూ, ఖాళీ సమయంలో రాపిడో డ్రైవర్‌గా పనిచేసే వెంకటేశ్వరరావుకు రెండు నెలల క్రితం సురేష్ కుమార్ అలియాస్ సూర్య అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఢిల్లీ NIAలో ఐపీఎస్ అధికారిని అని, ప్రస్తుతం సెలవుపై తిరుపతికి వచ్చానని నమ్మబలికాడు. హైదరాబాద్ ఆదాయపన్ను శాఖలో ‘డివిజనల్ అడ్వైజర్’ ఉద్యోగం ఇప్పిస్తానని బాధితుడికి ఆశ చూపాడు.అతని మాటలు నమ్మిన వెంకటేశ్వరరావు విడతల వారీగా ఫోన్‌పే, పేటీఎం ద్వారా సుమారు రూ. 1.50 లక్షలు చెల్లించాడు. ఎందుకో సురేష్ కుమార్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాధితుడు తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరాడు. దీంతో నిందితుడు బెదిరింపులకు దిగాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అలిపిరి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోగా, అసలు విషయం బయటపడింది. నిందితుడు NIA ఆఫీసర్, డిటెక్టివ్ అంటూ రకరకాల పేర్లతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, బదిలీల పేరిట ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు. ఉన్నతాధికారులమని ఎవరైనా చెబితే వారి వివరాలను అధికారికంగా ధృవీకరించుకోవాలని సూచించారు. మోసపోతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని తిరుపతి జిల్లా పోలీసులు కోరారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్.. అతడిలా కోటికి ఒక్కరుంటారు
Srisailam: శ్రీశైలం నడకదారిలో పెద్దపులి ప్రత్యక్షం.. అంతా మల్లన్న మాయ అంటూ
Sapota: బాగా పండిన సపోటాలు తింటే ఏమవుతుందో తెలుసా ?? ఈ వీడియో తప్పక చూడండి
Balakrishna: బాలయ్య దెబ్బ.. కుర్ర హీరోలు అందరూ అబ్బా..
Ram Charan: ఓ పక్క రూ.కోట్లు.. ఇంకో పక్క ఇచ్చిన మాట.. సందిగ్ధంలో చరణ్
