అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

Updated on: Aug 11, 2026 | 11:15 AM

సోషల్ మీడియాలో అందమైన యువతుల ఫోటోలతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి ఓ యువకుడు రిటైర్డ్ ఉద్యోగిని రూ.20 లక్షలకు మోసం చేశాడు. అమ్మాయిలా చాటింగ్ చేస్తూ స్నేహం పెంచుకుని, ఆర్థిక సమస్యల పేరుతో డబ్బులు వసూలు చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అపరిచితుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు అంగీకరించవద్దని, వ్యక్తిగత బ్యాంక్ వివరాలు పంచుకోవద్దని పోలీసులు సూచించారు.

సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిల ఫోటోలు కనిపిస్తున్నాయని టెంప్ట్ అయ్యారో అంతే సంగతులు! పురుషుల బలహీనతలను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో ఓ యువకుడు, అమ్మాయిలా నమ్మించి ఏకంగా ఓ రిటైర్డ్ ఉద్యోగిని రూ.20 లక్షలకు నిలువునా ముంచేశాడు. విశాఖకు చెందిన ఒక రిటైర్డ్ ఉద్యోగికి ఫేస్‌బుక్‌లో కావ్య, సంధ్యారాణి అనే పేర్లతో అందమైన యువతుల డీపీలతో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వచ్చాయి. అవి నిజమైన అమ్మాయిల ప్రొఫైల్స్ అని నమ్మిన ఆ బాధితుడు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు. సదరు కేటుగాడు ఆన్ లైన్ లో అమ్మాయిలా చాటింగ్ చేస్తూ స్నేహం పెంచుకున్నాడు. తనకు తీవ్ర ఆర్థిక సమస్యలు ఉన్నాయని ఎమోషనల్ డ్రామాలు ఆడటంతో బాధితుడు కరిగిపోయి దఫదఫాలుగా రూ.20 లక్షలు ఆన్‌లైన్ ద్వారా పంపాడు. ఎంతకీ నగదు డిమాండ్లు ఆగకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఫేస్‌బుక్ ఐపీ అడ్రస్ ఆధారంగా హైదరాబాద్ బోడుప్పల్‌కు చేరుకున్నారు. అక్కడ అమ్మాయి ఉంటుందని భావించిన పోలీసులకు షాకింగ్ నిజం తెలిసింది. ఆ అకౌంట్ నడుపుతున్నది అమ్మాయి కాదు, గుంటూరు జిల్లా కారంపూడికి చెందిన అన్నపరెడ్డి సాంబశివరావు అనే యువకుడు! బోడుప్పల్‌లోని ముకుందా కిచెన్స్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్న సాంబశివరావు.. ఈజీ మనీ కోసం ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటుపడి అప్పులపాలయ్యాడు. వాటిని తీర్చడానికి అందమైన మహిళల ఫోటోలతో నకిలీ ఫేస్‌బుక్ ఐడీలు క్రియేట్ చేశాడు. బాధితుడికి అనుమానం రాకుండా ఉండేందుకు మధ్యమధ్యలో తనతో పరిచయం ఉన్న ఒక మహిళతో మాట్లాడించేవాడు. ఇలా ‘స్వీట్ డాడీ’ ట్యాగ్‌తో ట్రాప్ చేసి లక్షలు గుంజాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి మొబైల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఇతగాడు మరికొందరిని కూడా ఇలాగే బురిడీ కొటించినట్లు ఆధారాలు లభించాయి. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దని, వ్యక్తిగత బ్యాంక్ వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని సిపి చెప్పారు. ఆన్‌లైన్ మోసాల పట్ల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్‌ చేసిన డ్రైవర్‌, కండక్టర్‌.. ఆ తర్వాత

అల్లు అర్జున్ X షారూఖ్ ఖాన్? కానీ ఊహించని ట్విస్ట్ ఉంది!

ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

రేషన్‌ షాపులో బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. పరిశీలించి షాక్‌ తిన్న యజమాని

Loading...
Unable to load recommendations.
Follow Us