సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు

Updated on: May 25, 2026 | 4:53 PM

రష్యాకు చెందిన మాజీ సైనికుడు రుస్తమ్ నబీవ్ రెండు కాళ్లు లేకపోయినా కేవలం చేతుల బలంతోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించాడు. మిలిటరీ ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన ఆయన నిరాశ చెందకుండా పర్వతారోహణను సవాల్‌గా తీసుకున్నారు. “జీవితం ముగిసిపోయిందనుకునే వారికోసం” అంటూ ఆయన పంచుకున్న సందేశం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి స్ఫూర్తినిస్తోంది.

సంకల్పం బలం ముందు ఎంతటి వైకల్యమైనా తలవంచాల్సిందే. అందుకు ఉదాహరణే ఈ ఘటన. రష్యాకు చెందిన మాజీ సైనికుడు రుస్తమ్ నబీవ్… రెండు కాళ్లు లేకపోయినా, కేవలం చేతుల బలంతోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ పర్వతారోహణ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. కృత్రిమ కాళ్లను ఉపయోగించికూడా ఇది సాధించవచ్చు.. కానీ అవేవీ తనకు అవసరం లేదని, కేవలం చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన ప్రపంచపు మొట్టమొదటి వ్యక్తిగా రుస్తమ్ రికార్డు సృష్టించాడు. ఒకప్పుడు రష్యా సైన్యంలో పారాట్రూపర్‌గా పనిచేసిన రుస్తమ్ జీవితాన్ని 2015లో ఒక ప్రమాదం తలకిందులు చేసింది. ఆయన నిద్రిస్తున్న మిలిటరీ బ్యారెక్స్ భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో రెండు కాళ్లను కోల్పోయాడు రుస్తమ్‌. ఆ విపత్కర పరిస్థితిలో కుంగిపోకుండా, పర్వతారోహణను సవాల్‌గా తీసుకున్నాడు. ప్రస్తుత స్ప్రింగ్ క్లైంబింగ్ సీజన్‌లో భాగంగా బుధవారం ఉదయం నేపాల్ కాలమానం ప్రకారం 8:16 గంటలకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తన కలని నిజం చేసుకున్నాడు. ఈ అద్భుత విజయాన్ని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కోఆర్డినేటర్ ఖిమ్ లాల్ గౌతమ్ అధికారికంగా ధ్రువీకరించారు. శిఖరాగ్రంపై నుండి రుస్తమ్ సోషల్ మీడియాలో పంచుకున్న భావోద్వేగ సందేశం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని కదిలిస్తోంది. “జీవితం ముగిసిపోయిందని అనుకునే వారి కోసం.. రుస్తమ్ నబీవ్, ఎవరెస్ట్ 2026” అంటూ రాసి ఉన్న ప్లకార్డుతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ, ఈ విజయాన్ని తన అభిమానులకు అంకితం ఇచ్చాడు. ప్రస్తుతం శిఖరం నుండి బేస్ క్యాంప్‌నకు సురక్షితంగా తిరిగి వస్తున్న రుస్తమ్‌కు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు సెల్యూట్ చేస్తూ, “ప్రపంచంలోనే అత్యుత్తమ మోటివేటర్” అని కొనియాడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ర్యాట్‌ స్నాకింగ్‌… ఇదో వింత అలవాటు..! కానీ చాలా డేంజర్!

పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్‌ ఎందుకు చనిపోతుంది? నమ్మలేని నిజాలు..

‘ఫ్రెంచ్ సండే’ ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే

అద్భుతాన్ని కనిపెట్టి.. సీక్రెట్‌ మెయిన్‌టైన్ చేసిన ఇస్రో!

కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా

Follow Us