dog saved cat: జాతివైరం మరచి ప్రాణాలకు తెగించి సాటి జీవి ప్రాణం కాపాడిన కుక్క.. వైరల్ వీడియో.

|

Aug 01, 2022 | 9:58 AM

సోషల్ మీడియాలో కుక్కలు, పిల్లులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. సాధారణంగా కుక్క, పిల్లి బద్ధ శత్రువులుగా చెబుతారు.


సోషల్ మీడియాలో కుక్కలు, పిల్లులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. సాధారణంగా కుక్క, పిల్లి బద్ధ శత్రువులుగా చెబుతారు. కానీ, కాలంతోపాటు అవీ మారుతున్నాయి… తమ వైరాన్ని మరిచి స్నేహంగా ఉంటున్నాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ పిల్లి ఒక పూల్‌లో పడిపోయింది. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. అది చూసిన కుక్క చలించిపోయింది. దానిని ఎలాగైనా కాపాడాలనుకుంది. వెంటనే నీటిలోకి దూకి పిల్లిని తన వీపుపైకి కూర్చోబెట్టుకొని గట్టుపైకి ఎక్కించింది. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. కుక్కను చూసి పిల్లి భయపడిందో ఏమో గానీ.. ఒడ్డుకు వచ్చిన తరువాత ఆ పిల్లి.. తనను కాపాడిన కుక్క మొహం కూడా చూడకుండా త్వరత్వరగా అక్కడినుంచి జారుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సీన్ అంతా కెమెరాలో రికార్డ్ చేసి.. ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షిస్తూ తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us on