కుక్కలు చాలా తెలివైనవి, విశ్వాసపూరిత జంతువులు. మనుషులకు త్వరగా మచ్చికయ్యే వీటిని పెంచుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. వాటిని కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. వాటితో ఆడుకోవడం, కలిసి పని చేయం, వాకింగ్ కు తీసుకువెళ్లడం వంటివి చేస్తుంటారు. అవి చేసే ప్రతి చిన్న చిలిపి పనిని ఆస్వాదిస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. తాజాగా పార్క్లో ఓకుక్క చేసిన సందడికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో తోటలోని స్ప్రింక్లర్ ముందు ఓ శునకం ఆనందంగా ఆడుకుంటుంది. తోటలో ఒక పువ్వు లాంటి స్ప్రింక్లర్, దాని నుంచి వచ్చే నీరు వివిధ దిశలలో వస్తుంది. ఇది చూసిన డాగీ దాని వెంట పరిగెత్తుతూ సంతోషంగా గంతులేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. కొద్ది సమయంలోనే ఇది వైరల్ గా మారింది. ఈ వీడియో లక్షలమంది వీక్షించారు. వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఈ కుక్కతో ప్రేమలో పడ్డానని, ‘నా మనసు కూడా ఇలాగే డాగీతో ఆడాలని ప్రయత్నిస్తోంది’ అంటూ రాశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్లోనే..
Pizza: మార్కెట్లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..