కోడి పిల్లలతో కుక్క స్నేహం.. నెటిజన్ల ప్రశంసలు

Updated on: Apr 28, 2023 | 9:18 AM

సాధారణంగా కుక్కను చూస్తే ఏ కోడి అయినా.. తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తుంది. అలాగే కోడి కనిపిస్తే చాలు.. నోట బెట్టుకుని తినేయాలని కుక్కలు ప్రయత్నిస్తుంటాయి. అలాంటి వాటి మధ్య స్నేహం కుదురుతుందని ఎవరు కూడా ఎవరూ ఊహించరు. కానీ కుదిరింది.

సాధారణంగా కుక్కను చూస్తే ఏ కోడి అయినా.. తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తుంది. అలాగే కోడి కనిపిస్తే చాలు.. నోట బెట్టుకుని తినేయాలని కుక్కలు ప్రయత్నిస్తుంటాయి. అలాంటి వాటి మధ్య స్నేహం కుదురుతుందని ఎవరు కూడా ఎవరూ ఊహించరు. కానీ కుదిరింది. ఒక వీధి కుక్క కోడి పిల్ల సమూహంతోనే స్నేహం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తల్లితో తిరుగుతున్న ఓ కోడి పిల్లతో స్నేహం చేసేందుకు ప్రయత్నించింది వీధి కుక్క. అయితే కోడిని నోట బెట్టుకుని పోయే కుక్కలను నమ్మకూడదనుకున్న ఆ తల్లి కోడి.. తన పిల్లల వద్దకు దాన్ని రానివ్వలేదు. ఆ కుక్కను పొడిచే ప్రయత్నం చేసింది. ఆ కుక్క మెల్ల మెల్లగా, కోడి పిల్లతో స్నేహం చేసింది. తమ తోబుట్టువులో స్నేహం చేస్తున్న కుక్క, తమను ఏం చేయదని గ్రహించిన మిగిలిన కోడిపిల్లలు కూడా దానితో కలిసిపోయాయి. అలా సాగిన ఈ దృశ్యాలను వీడియో తీసిన వ్యక్తి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘నిజమైన స్నేహం’ అంటూ ఆ మూగ జీవాలను ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

6000 అడుగుల ఎత్తునుంచి కింద పడి.. 72 గంటలు నరకయాతన

Balagam: స్టార్ డైరెక్టర్‌ ఫిల్మ్‌లో కీ రోల్.. బంపర్ ఆఫర్ కొట్టిన బలగం పాప !!

Published on: Apr 28, 2023 09:18 AM
Loading...
Unable to load recommendations.
Follow Us