ఉబెర్ డ్రైవర్ నిజాయితీ.. నెటిజన్ల సెల్యూట్!
డిజిటల్ చెల్లింపులలో జాగ్రత్త అవసరాన్ని ఈ కథనం నొక్కి చెబుతుంది. పొరపాటున తన ఖాతాకు చేరిన రూ. 10,000ను ఒక ఉబెర్ డ్రైవర్ (శ్రీకాంత్) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (దేబశిష్ త్రిపాఠి)కి స్వయంగా వెనక్కి ఇచ్చాడు. బహుమతిని కూడా తిరస్కరించి, నిజాయితీ చాటుకున్న శ్రీకాంత్ కథ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డిజిటల్ యుగంలో నిజాయితీకి ఇదొక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది.
డిజిటల్ పేమెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమౌంట్ ఎవరికి పంపుతున్నామో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని పంపించాలి. కొన్ని పేర్లు ఒకేలాగా ఉండటంతో ఒకరికి పంపాల్సిన అమౌంట్ ఇంకొకరికి పంపించేస్తుంటాం. తీరా అమౌంట్ వెళ్లిపోయాక అది తిరిగి రాబట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది, ఒక సామాన్య క్యాబ్ డ్రైవర్ చూపిన అసాధారణ నిజాయతీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొరపాటున తన ఖాతాలో పడిన వేల రూపాయలను వెతికి మరీ బాధితుడికి అప్పగించి, అందరి మనసు గెలుచుకున్నాడు. భువనేశ్వర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దేబశిష్ త్రిపాఠి, తన బిజినెస్ పార్ట్నర్‌కు పంపాల్సిన రూ. 10,000 మొత్తాన్ని పొరపాటున ఉబెర్ డ్రైవర్‌కు పంపారు. పేర్లు ఒకేలా ఉండటంతో జరిగిన ఈ పొరపాటును గమనించిన దేబశిష్, యాప్ ద్వారా డ్రైవర్‌ను సంప్రదించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇక ఆ డబ్బు రాదని ఆయన ఆశ వదులుకున్నారు. కానీ, అదే రోజు రాత్రి అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. ఆ ఉబెర్ డ్రైవర్ శ్రీకాంత, దేబశిష్ అడ్రస్ తెలుసుకుని మరీ ఆయన అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. పొరపాటున వచ్చిన డబ్బును బాధితుడికి అప్పగించారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కృతజ్ఞతగా కొంత బహుమతి ఇవ్వజూపినా, దానిని ఆయన సున్నితంగా తిరస్కరించడం విశేషం. ఈ విషయాన్ని దేబశిష్ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. కేవలం కొద్ది గంటల్లోనే లక్షన్నర మందికి పైగా ఈ పోస్ట్‌ను వీక్షించారు. నిజాయతీకి రూపం ఉంటే అది శ్రీకాంతే అంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. డిజిటల్ యుగంలో ఫోన్ చేస్తేనే స్పందించని వ్యక్తుల మధ్య, స్వయంగా ఇంటికి వచ్చి డబ్బు ఇచ్చిన ఈ క్యాబ్ డ్రైవర్ సెల్యూట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోట్ల ఏళ్ల క్రితం మీ ఊరు ఎక్కడుందో చెప్పేసే ఆన్‌లైన్ టూల్
