PM Modi turns 71: మోదీకి వినూత్నంగా శుభాకాంక్షలు..! ఇలాంటి విషెస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ (వీడియో)

|

Sep 19, 2021 | 4:55 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సెప్టెంబర్‌ 17న ప్రధాని మోదీ పుట్టినరోజు. ఈ సందర్భంగా భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు, ప్రధాని అభిమానులు పలు సేవాకార్యక్రమాలు చేపట్టారు.మోడీకి ఓ చోట వినూత్నంగా శుభాకాంక్షలు అందాయి...

భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సెప్టెంబర్‌ 17న ప్రధాని మోదీ పుట్టినరోజు. ఈ సందర్భంగా భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు, ప్రధాని అభిమానులు పలు సేవాకార్యక్రమాలు చేపట్టారు. భారీ కేకులను కట్‌ చేశారు. అర్ధరాత్రినుంచే అభిమానులనుంచి ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని దేశంలోని పలు ప్రాంతాల్లో సప్టెంబర్‌ 16 అర్ధరాత్రి నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. బీజేపీ శ్రేణులు ఉత్సహంతో.. ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా భారీ కేక్‌లను సైతం కట్ చేశారు. మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో అర్ధరాత్రి సంబరాలు అంబరాన్నంటాయి.

ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ బీజేపీ శ్రేణులు భారతమాత ఆలయం దగ్గర 71 వేల దీపాలను వెలిగించారు. దీంతోపాటు 71 కిలోల లడ్డును కట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ రూప గంగూలీ, బీహెచ్‌యూ మాజీ వీసీ జిసి త్రిపాఠి ‘కాశీ సంకల్ప్’ అనే పుస్తకాన్నిఆవిష్కరించారు. ఇక నరేంద్ర మోదీ 71 వ పుట్టినరోజు వేడుకలను మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. లాల్‌ఘాటి చౌరహాలో బీజేపీ కార్యకర్తలు 71 అడుగుల పొడవైన వ్యాక్సిన్ ఆకారంలో ఉన్న కేక్‌ను కట్ చేశారు. టీకా ఆవశ్యకతను తెలియజేస్తూ కేకుపై నమో టీకా అని చిత్రించారు. కొందరు అభిమానులు తమ చేతులపై మోదీ టాటూను వేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Miracle In Shiva Temple video: శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు.. అదే సమయంలో నాగుపాము చేసిన అద్భుతం(వీడియో)

 chasing scene Viral video: సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు.. వైరల్ గా మారిన వీడియో..

 Flyover collapses Video: కూలిన ఫ్లై ఓవర్.. పలువురికి గాయాలు..!ఈ వంతెన స్పెషల్ ఏంటంటే..(వీడియో)

 Tamannaah Video: కొత్త కొత్త పాత్రల్లో నటిస్తే ఆ కిక్కే వేరంటున్న తమన్నా..(వీడియో).

Follow us on