చిరుజల్లులతో పరవశించిన ప్రకృతి.. పొలాల్లో చెంగు చెంగున ఎగురుతున్న జింకలు.. అపురూపమైన దృశ్యం..
విస్తారంగా వర్షాలు కురుస్తున్నా నేపథ్యంలో అడవుల నుండి జింకలు బయటకు వచ్చి చూపరులకు కనువిందు చేస్తున్నాయి..ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నారాయణఖేడ్ నియోజకవర్గం మనుర్ మండలం మైకోడ్ గ్రామ శివారులో సుమారు 100 కి పైగా జింకలు బయటకు వచ్చి గుంపులు
విస్తారంగా వర్షాలు కురుస్తున్నా నేపథ్యంలో అడవుల నుండి జింకలు బయటకు వచ్చి చూపరులకు కనువిందు చేస్తున్నాయి..ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నారాయణఖేడ్ నియోజకవర్గం మనుర్ మండలం మైకోడ్ గ్రామ శివారులో సుమారు 100 కి పైగా జింకలు బయటకు వచ్చి గుంపులు,గుంపులుగా పచ్చిక బయిల మీద కనువిందు చేస్తున్నాయి.. వర్షాలు కురవడంతో పచ్చటి చెట్ల మధ్య జింకలు గుంపులు గుంపులుగా,చెంగు,చెంగు మంటూ గంతులు వేస్తున్నాయి..పక్కనే పంట పొలాల్లో పని చేస్తున్న రైతులు హుషారుగా తిరుగుతున్న జింకల గుంపులని తమ సెల్ ఫోన్లో చిత్రికరరించారు.చాలా రోజుల తర్వాత జింకలు ఇలా పచ్చిక బయళ్ల మధ్య చేస్తున్న విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి…
Published on: Jul 22, 2023 12:50 PM