Bihar court: కోర్ట్‌ ఆర్డర్‌: ఊరి ఆడవాళ్లందరి బట్టలు ఉతికి ఐరన్‌ చేయాలి.. వింత పనిష్మెంట్ (వీడియో వైరల్)

|

Sep 27, 2021 | 9:39 AM

అత్యాచారయత్నం కేసులో ఓ కోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది. ఇంతవరకు ఎక్కడా, ఎప్పుడూ వినని తీర్పు నిస్తూ.. నిందితుడికి శిక్ష విధించింది... ఆ ఊరిలోని మహిళలందరి బట్టలు, ఉతికి, ఐరన్ చేయాలని ఆదేశించింది.

అత్యాచారయత్నం కేసులో ఓ కోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది. ఇంతవరకు ఎక్కడా, ఎప్పుడూ వినని తీర్పు నిస్తూ.. నిందితుడికి శిక్ష విధించింది… ఆ ఊరిలోని మహిళలందరి బట్టలు, ఉతికి, ఐరన్ చేయాలని ఆదేశించింది. ఆరు నెలలపాటు తప్పని సరిగా ఇలా చేయాల్సిందేనని కోర్టు ఖచ్చితమైన తీర్పునిచ్చింది…నిందితుడికి కేసు నుంచి బెయిల్ మంజూరు చేస్తూ ఈ వినూత్న శిక్ష వేసింది. ఈ ఘటన బీహార్‌లోని మధుబానిలోని ఓ కోర్టు ఇలా ఊహించని తీర్పునిచ్చింది.

బిహార్‌కు చెందిన ఓ యువకుడు..స్థానిక మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు. దీనిపై బాధితురాలు కేసు నమోదు చేయగా, మధుబాని కోర్టు కేసు విచారించింది. ఏప్రిల్‌లో నిందితున్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. తాజాగా, అతని బెయిల్ పిటిషన్‌ను కోర్టు విచారించింది. నిందితుడు 20ఏళ్ల యువకుడే కాబట్టి, క్షమించి వదిలిపెట్టాలని, నిందితుడు సమాజానికి సేవ చేయాలని భావిస్తున్నాడని అతడి తరపు లాయర్‌ కోర్టు తెలిపారు. వాదనలు విన్న కోర్టు అతనికి శరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

బాధితురాలు సహా ఆ ఊరిలోని మహిళలందరి బట్టలను ఆరు నెలలపాటు ఉచితంగా ఉతికి ఐరన్ చేయాలని కోర్టు ఆదేశించింది. దాంతోపాటు.. 10వేల రూపాయలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని తెలిపింది. మొత్తానికి ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని చదవండి ఇక్కడ : Bharat Bandh Live Video: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొదలైన ‘భారత్ బంద్’.. (లైవ్ వీడియో)

 Cyclone Gulab Live Updates video: తీరం దాటిన గులాబ్‌ తుఫాన్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. (లైవ్ వీడియో)

 News Watch Live Video: నేడు, రేపు భారీ వర్షాలు | భారత్ బంద్ సక్సెస్ అయ్యేనా..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు న్యూస్ వాచ్..(వీడియో)

 Divorce Party Video: విడాకుల సందర్భంగా గ్రాండ్‌ పార్టీ.. విముక్తి లభించిందంటున్న మహిళ..(వీడియో)

Published on: Sep 27, 2021 09:23 AM