బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మ వ్యాధులతో విద్యార్థుల అవస్థలు

Updated on: Nov 13, 2026 | 1:25 PM

నిర్మల్ జిల్లాలోని రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (బాసర ట్రిపుల్ ఐటీ) మరోసారి వార్తల్లో నిలిచింది. భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనే ఆశతో క్యాంపస్‌కు వచ్చిన విద్యార్థులకు కనీస వసతులు కరువయ్యాయి. ముఖ్యంగా హాస్టళ్లలో నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. బాలికలు ఉండే గంగా, యమున వసతి గృహాల్లో కుళాయిల నుంచి పూర్తిగా మట్టితో కూడిన మురుగునీరు వస్తోంది.

నిర్మల్ జిల్లాలోని రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (బాసర ట్రిపుల్ ఐటీ) మరోసారి వార్తల్లో నిలిచింది. భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనే ఆశతో క్యాంపస్‌కు వచ్చిన విద్యార్థులకు కనీస వసతులు కరువయ్యాయి. ముఖ్యంగా హాస్టళ్లలో నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. బాలికలు ఉండే గంగా, యమున వసతి గృహాల్లో కుళాయిల నుంచి పూర్తిగా మట్టితో కూడిన మురుగునీరు వస్తోంది.ఈ కలుషిత నీటిని స్నానానికి, ఇతర అవసరాలకు ఉపయోగించడం వల్ల విద్యార్థినులు చర్మవ్యాధులు, దద్దుర్లు, అలర్జీలతో బాధపడుతున్నారు. మెస్‌లలో కూడా నాణ్యత లేని ఆహారం వడ్డిస్తున్నారని, అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటకు కూడా ఇదే కలుషిత నీటిని వాడుతున్నారని అనుమానాలున్నాయి. సమస్యపై అధికారులను ప్రశ్నిస్తే, సస్పెండ్ చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఫామ్‌లో ఉన్న బ్యూటీస్‌కి తప్పని వెయిటింగ్‌..

నవంబర్, డిసెంబర్ నెలల్లో బాక్సాఫీస్ పై చిన్న సినిమాల దండయాత్ర

బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రణబీర్ కపూర్ Vs రణవీర్ సింగ్..

రామాయణ తరువాత రాజమౌళి మనసు మార్చుకున్నారా?

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us