2027లో ఏం జరగబోతోంది? బాబా వంగ జోస్యం తెలిస్తే వణికిపోవాల్సిందేనా?

Updated on: Sep 13, 2026 | 4:43 PM

2027లో కొంతమంది మనుషుల్లో మానవాతీత శక్తులు వెలుగులోకి వస్తాయని బాబా వంగా చెప్పారంటూ ప్రచారం జరుగుతోంది. జన్యుపరమైన మార్పులు లేదా వ్యాధుల కారణంగా ఇలాంటి శక్తులు రావచ్చని ఆమె అనుచరులుగా చెప్పుకునేవారు వాదిస్తున్నారు. అయితే బాబా వంగా నిజంగా ఈ మాటలు చెప్పారనడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. గతంలో ఆమెకు ఆపాదించిన ఎన్నో అంచనాల మాదిరిగానే ఈ వాదనకు కూడా శాస్త్రీయ ఆధారాలు కనిపించడం లేదు.

ఒక వ్యక్తి ఏదైనా ఒక సూపర్ పవర్ మీకు చూపిస్తామంటారు. కానీ అలాంటి పవర్ ఆయనకు లేదని మీరు అనుకుంటారు. కానీ అది నిజమని మీరు నమ్మేలా ఆయన.. తన శక్తిని చూపిస్తారు. అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? వావ్ అని ఆశ్చర్యపోతారు. వచ్చే ఏడాది మీలానే చాలామంది ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే.. భవిష్యత్తులో నిజంగానే అలాంటి వ్యక్తులు మీకు ఎదురుపడొచ్చు. బాబా వంగా ఇలా చెప్పారంటూ ఓ వాదన ప్రచారంలో ఉంది. ఇప్పుడు నడుస్తోంది 2026 సంవత్సరం కదా. నెక్స్ట్ ఇయర్.. అంటే.. 2027లో కొంతమంది మనుషుల్లో మానవాతీత శక్తులు వెలుగుచూస్తాయని బాబా వంగా చెప్పారంటున్నారు ఆమె అనుచరులు. ఒక డిసీజ్ లేదా జన్యుపరమైన ప్రయోగంతో ఇలాంటి శక్తులు మనుషులకు వస్తాయంట. అసలు మానవాతీత శక్తులు అంటే ఏమిటి? మనుషులు చేయలేని పనులు ఎవరైనా చేయగలిగితే.. వాళ్లకు మానవాతీత శక్తులు ఉన్నాయంటారు. అలాంటివారిని సూపర్ హ్యూమన్స్ అని పిలవడం మామూలే. మరి బాబా వంగా చెప్పినట్లు నిజంగానే అలాంటి వాళ్లు పుడతారా? లేదా ఉన్నవారికే కొన్ని అతీత శక్తులు వస్తాయా? అసలది సాధ్యమేనా? బాబా వంగా ఇలా చెప్పారనడానికి ఆధారాలున్నాయా? మరి ఆమె అనుచరులం అని చెప్పుకుంటున్నవారు చేసే వాదనకు బేస్ ఏమిటి? బాబా వంగా చెప్పారని ప్రచారం జరుగుతున్న మానవాతీత శక్తులున్న వ్యక్తులు చుట్టూ పెద్ద చర్చే నడుస్తోంది. సూపర్ హ్యూమన్స్ గురించి చిన్నప్పుడు కథల్లో చదువుకునే ఉంటారు. చాలా మంది సినిమాల్లో కూడా చూసే ఉంటారు. కానీ నిజజీవితంలో మాత్రం అలాంటి వారు మీకు తారసపడి ఉండకపోవచ్చు. బహుశా కొద్ది మంది మాత్రం.. తన లైఫ్ లో అలాంటి వారిని చూశాం అని చెప్పి ఉండొచ్చు. అంటే.. హిమాలయాల్లో తపస్సు చేసేవారికి అతీత శక్తులు ఉంటాయని.. అలాంటి వారు ఏది అంటే అది జరిగిపోతుందని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో వాళ్లు ముందే చెప్పగలుగుతారని చాలామంది చెప్పుకుంటారు. చాలామంది స్వీయ అనుభవంలోకి.. అంటే వాళ్లు స్వయంగా ఎక్స్ పీరియన్స్ చేస్తే కాని ఇలాంటివాటిని నమ్మరు. ఝూమ్మంతర్ కాళి, అబ్రకదబ్ర అంటూ కొన్ని పదాలు.. లేదా.. మంత్రాలు లాంటివి చదువుతారు. తమకేదో అతీత శక్తులు ఉన్నట్టుగా నమ్మించడానికి ప్రయత్నిస్తారు. మరికొంతమంది.. మాయా లేదు, మర్మం లేదు అంటూ మ్యాజిక్ చేయడానికి ట్రై చేస్తారు. మరిక్కడ బాబా వంగా చెప్పారంటున్న వాళ్లు ఎవరు? వారిని ఎలా గుర్తించాలి? నిజంగానే మనుషులకు మానవాతీత శక్తులు రాబోతున్నాయా? మానవాతీత శక్తులు అంటే.. మనిషి చేయలేని పనులు చేసే శక్తి ఉన్నవాళ్లు అని చెప్పుకున్నాం కదా. అంటే ఏఐ టెక్నాలజీతో పని చేసే రోబోట్స్ కూడా ఇవే కోవ కిందకు వస్తాయా? ఎందుకంటే మనిషి కన్నా ఎక్కువగా ఆలోచిస్తూ.. ఇంకా చెప్పాలంటే.. మనిషికి మించి ఆలోచిస్తూ.. మనుషులు చేయలేని పనులు కూడా చేసే శక్తి ఉన్న టెక్నాలజీని తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే బాబా వంగా చెప్పారంటున్న మానవాతీత శక్తులు ఉన్న మనుషులు అంటే.. ఇలాంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న హ్యూమనాయిడ్ రోబోట్లేనా? భవిష్యత్తులో మనిషి కన్నా వీటికే ఎక్కువ పవర్ ఉంటుందని.. ఇవి అచ్ఛం మనిషిలానే సొంతంగా ఆలోచిస్తూ.. అదే మనిషి కన్నా ఎక్కువ పనులు చేయగలవని.. శాస్త్రవేత్తలు అంటున్నారు. కాకపోతే ఇక్కడో ఓ పాయింట్ గురించి చెప్పుకోవాలి. అది.. జన్యుపరమైన, లేదా వ్యాధి కారణంగా ఇలాంటి రోబోట్స్ తయారు కావు. కాబట్టి ఇలాంటివాటిని ఈ లాజిక్ ప్రకారం సూపర్ హ్యూమన్స్ అనలేం. మరి బాబా వంగా చెప్పారంటున్న సూపర్ హ్యూమన్స్ ఎవరు? ఎలా రాబోతున్నారు? నిజంగా మానవాతీత శక్తులు మనుషులకు ఉంటే.. ప్రపంచంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అన్నదానిపైనా ఇప్పటికీ క్లారిటీ లేదు. చరిత్రలో జరిగిన చాలా సంఘటనలను.. అంటే ప్రిన్సెస్ డయానా మృతి, కొవిడ్ కలకలం, అమెరికాకే షాకిచ్చిన 9/11 దాడులు.. ఇలాంటి వాటిని బాబా వంగా ముందే చెప్పారన్న ప్రచారం ఉంది. ఆమె అనుచరులం అని చెప్పుకుంటున్న వారు దీని గురించి గట్టిగానే చెబుతున్నా.. అది నిజమని చెప్పడానికి ఆధారాలేవి? గ్రహాంతర వాసులు ఉన్నారని.. వారు మనుషులపై దాడి చేస్తారని.. భూలోకాన్ని ఆక్రమిస్తారని చాలా ప్రచారం నడిచింది. దీని గురించి వాదనలు తప్ప.. శాస్త్రీయంగా నిరూపించే ఆధారాలు లేవు. ఇక యుద్ధాల సంగతి చూద్దాం. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. అమెరికా, ఇరాన్ యుద్ధం.. ఇంకా చెప్పాలంటే మూడో ప్రపంచ యుద్ధం గురించి కూడా చెప్పారంటారు. అలాగే భారీ భూకంపాలు, నేపాల వరదల గురించి కూడా ప్రస్తావించారంటారు. అంతరిక్షం నుంచి ఏలియన్స్ వస్తారని.. వాళ్లు మనుషులతో సంబంధాలు పెట్టుకుంటారని చెప్పారంటారు. కానీ వాటికి శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవు. మనకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలానో.. విదేశీయులకు నోస్ట్రడామస్ అలా. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి.. తాను రచించిన కాలజ్ఞానంలో చాలా విషయాలు చెప్పారు. వీటిలో బాగా ప్రచారంలో ఉన్నవి కొన్ని ఉన్నాయి. గోవులు కాసే సమయంలో రవ్వలకొండలో ఓ గుహలో ఆయన తన దివ్యదృష్టితో చూసిన వాటిని కాలజ్ఞానం రూపంలో ప్రజలకు వివరించారని అంటారు. అపుడే చెప్పెను బ్రహ్మంగారు.. అంటూ చాలా వాటి గురించి ప్రచారం జరుగుతోంది. ఇలా భవిష్యత్తులో ఏమేం జరుగుతాయో ఊహించి ముందే చెప్పడం వల్ల ఆయనకు బాగా పేరు వచ్చింది. అవన్నీ జరిగాయా లేదా అన్నదానికన్నా.. దాని గురించి ప్రచారం నడిచింది. ఇక నోస్ట్రడామస్ కూడా ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఏమేం జరగబోతోందో ముందే ఊహించి.. లెస్ ప్రొఫెసీస్ పేరుతో బుక్ రాశారని చెబుతారు. అందులో ఉన్నట్టుగానే అన్నీ జరిగాయా లేదా అన్నదాని కన్నా వాటి గురించి కూడా చాలా ఎక్కువ ప్రచారం నడిచింది. కొంతమందికి కొన్ని పవర్స్ ఉంటాయి. కానీ అవి వారికి ఎలా వచ్చాయో వారికే తెలియదు. ఉదాహరణకు.. ఒక వ్యక్తి చేతికి అసలు గడియారమే ఉండదు. కానీ.. మీరు టైమ్ అడిగితే.. కరెక్ట్ గా ఆ సమయంలో టైమ్ ఎంతో తడుముకోకుండా చెప్పేస్తారు. అది అనుకోకుండా వారి నోటి నుంచి వచ్చేస్తుంది. అది వారికి ఎలా సాధ్యమవుతుంది? చిన్నప్పుడు గడియారం మింగేసి ఉంటారు.. అందుకే అలా టైమ్ కరెక్ట్ గా చెప్పగలుగుతున్నాడు అని చాలా మంది అంటుంటారు. కానీ అది వాస్తవానికి దూరంగా ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో పవర్ ఉండొచ్చు. అంతమాత్రాన వాళ్లను సూపర్ హ్యూమన్స్ అని.. వారికి మానవాతీత శక్తులు ఉన్నాయని చెప్పలేం. కాకపోతే.. దీని గురించి సరైన అవగాహన లేనివారికి మాత్రం.. అలాంటి వారు సూపర్ హీరోలే.. సూపర్ హ్యూమన్సే. సో బాబా వంగ చెప్పిన మానవాతీత శక్తులు మనుషులకు ఎలా వస్తాయన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఇది ఎలా బ్రేక్ అవుతుంది అన్నది వాళ్ల అనుచరులు చెప్పినదానిని బట్టి నెక్స్ట్ ఇయర్ తేలిపోతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క నది లేదు.. చుక్క వర్షం పడదు.. అయినా నిత్యం 3.7 కోట్ల మందికి మంచినీరు.. ఎలా?

వైష్ణవితో నిజంగానే లవ్ ఉందా ? అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ

Loading...
Unable to load recommendations.
Follow Us