అటు భర్త.. ఇటు లవర్.. ముగ్గురం కలిసి ఎంజాయ్ చేద్దాం.. అంటూ తీసుకెళ్లిన భార్య

Updated on: Oct 26, 2026 | 9:30 PM

కుప్పం అటవీ ప్రాంతంలో భర్త శశికుమార్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. భార్య లక్ష్మి తన ప్రియుడు ప్రభుదేవతో కలిసి ‘ముగ్గురం కలిసి ఎంజాయ్ చేద్దాం’ అంటూ నమ్మించి శశికుమార్‌ను అడవికి తీసుకెళ్లి బీరు బాటిళ్లు, బండరాయితో కొట్టి చంపింది. అనంతరం మృతదేహాన్ని పాతిపెట్టినా, పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దుల్లోని కుప్పం అటవీ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఒక దారుణ హత్యోదంతం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ సంచలనం సృష్టించింది. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య లక్ష్మి, తన ప్రియుడు ప్రభుదేవతో కలిసి భర్త శశికుమార్‌ను అంతమొందించేందుకు పథకం వేసింది. ఈ క్రమంలోనే ‘ఏకాంతంగా ఎంజాయ్ చేద్దాం రండి’ అంటూ భర్త శశికుమార్‌ను నమ్మించి సెప్టెంబర్ 29న కుప్పం సమీపంలోని పెద్దవంక అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ ముందుగానే ఉన్న ప్రియుడు ప్రభుదేవతో కలిసి పథకం ప్రకారం శశికుమార్‌పై బీర్ బాటిళ్లతో దాడి చేసి, అనంతరం బండరాయితో తలపై మోది కిరాతకంగా హత్య చేశారు. మృతదేహాన్ని అడవిలోనే గుంత తీసి పాతిపెట్టారు. అక్టోబర్ 1న సమాచారం అందుకున్న కుప్పం పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో లక్ష్మి, ప్రభుదేవలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన సమాజంలో భార్యాభర్తల సంబంధాలపై తీవ్ర చర్చకు దారితీసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Honey: తేనె అంటే వాంతేనా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

యజమాని కోసం.. ఎనిమిదేళ్లుగా ఆసుపత్రిలోనే తిరుగుతున్న కోడిపుంజు!

రిటైర్‌మెంట్‌ జీవితానికి బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే.. భారత్‌లో ఈ 9 నగరాలు టాప్!

కుక్కను చూసి చిరుత పరుగో.. పరుగు.. ఏం జరిగిందో మీరే చూడండి!

కోతుల బెడదకు చెక్.. బామ్మగారి ఐడియా అదిరిందిగా!

Loading...
Unable to load recommendations.
Follow Us