సాధారణంగా ఏ భార్యకూడా తన భర్త మరో అమ్మాయివైపు క్యాజువల్‌గా చూసినా తట్టుకోలేదు.. ఇక మాట్లాడితే.. ఇంకేమైనా ఉందా.. అలాంటిది ఓ యువతి తన భర్తకు ప్రేమించిన అమ్మాయితో దగ్గరుండి పెళ్లిచేసింది. ఈ ఘటన తిరుపతిలో జరిగింది. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఈ ఘటన చర్చనీయాంశమైంది. స్థానిక అంబేడ్కర్ నగర్‌కు చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చదివాడు. టిక్‌టాక్‌లో రాణిస్తున్న అతడికి మొదట విశాఖకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. కొన్నాళ్లు ఇద్దరూ చనువుగా ఉన్నారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆమె నుంచి దూరమయ్యాడు. ఆతర్వాత కడప జిల్లాకు చెందిన మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు. అయితే ఈ యువతికూడా టిక్‌టాక్‌లోనే పరిచయం కావడం విశేషం. ఇదిలా ఉంటే , కొన్నాళ్ల తర్వాత మొదట ప్రేమించి దూరమైన యువతి తన ప్రియుడ్ని వెతుక్కుంటూ తిరుపతికి వచ్చింది. అతడికి పెళ్లయిన విషయం తెలిసింది నిరాశపడింది. అయినా తను ప్రేమించిన వ్యక్తిని వదులుకోలేకపోయింది. ఆ యువకుడి భార్యతో మాట్లాడి.. తానూ ఇక్కడే ఉంటానని, అంతా కలిసి ఉందామని చెప్పింది. ఆమె మాటలు విని యువకుడి భార్య ఆలోచనలో పడింది. చివరకు ముగ్గురూ కలిసి ఉండడానికి ఒప్పుకుంది. తన భర్తకు తానే స్వయంగా ఆ యువతితో పెళ్లి చేయడానికి సిద్ధపడింది. తానే దగ్గరుండి భర్త ప్రియురాలిని అలంకరించి సెప్టెంబర్ 21న పెళ్లి చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‌లోనే..
Pizza: మార్కెట్లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..