Food Delivery Boy: ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా ఏడేళ్ల బాలుడు.! అందరిని షాక్ గురి చేస్తున్న వీడియో.. ఎందుకో తెలుసా.?

|

Aug 15, 2022 | 9:11 PM

ప్రముఖ ఫుడ్ ఆర్డరింగ్ యాప్ జొమాటో డెలివరీ బాయ్‌గా ఏడేళ్ల బాలుడు ఇంటింటికీ డెలివరీ అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ మిట్టల్ అనే అనే వ్యక్తి..


ప్రముఖ ఫుడ్ ఆర్డరింగ్ యాప్ జొమాటో డెలివరీ బాయ్‌గా ఏడేళ్ల బాలుడు ఇంటింటికీ డెలివరీ అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ మిట్టల్ అనే అనే వ్యక్తి.. జొమాటోలో ఓ చాక్లెట్ బాక్స్ ఆర్డర్ పెట్టాడు. అయితే, ఆర్డర్ డెలివరీ చేసేందుకు పెద్దవాళ్లు వస్తారనుకుంటే, తలుపు దగ్గర ఏడేళ్ల పిల్లవాడిని చూసి మిట్టల్ ఆశ్చర్యపోయారు. ఆ బాలుడికి సంబంధించిన వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. జొమాటోలో నువ్వెలా చేరావు? అని ప్రశ్నించాడు మిట్టల్‌. అందుకు అబ్బాయి బదులిస్తూ, వాస్తవానికి తన తండ్రి జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడని, తన తండ్రి రోడ్డుప్రమాదంలో గాయపడి ఇంటికే పరిమితం కావవడంతో, తన తండ్రి తరఫున తానే జొమాటో ఆర్డర్లు డెలివరీ ఇస్తున్నానని వివరించాడు. మరి నువ్వు స్కూలుకు వెళ్లవా.? అని ప్రశ్నించగా, పగలు స్కూలుకు వెళతానని, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జొమాటో ఆర్డర్డు డెలివరీ ఇస్తానని తెలిపాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో జొమోటో దృష్టికి వచ్చింది. ఈ అంశంలో జొమాటో పెద్దమనసుతో స్పందించింది. ఆ కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి కఠినచర్యలు తీసుకోవడంలేదని జొమాటో వెల్లడించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us on