ఎలుక, పిల్లికి సంబంధించిన అనేక వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఇంటర్నెట్ పబ్లిక్ ఈ వీడియోలను చాలా ఇష్టపడుతున్నారు. ఎలుక, పిల్లి శత్రుత్వానికి సంబంధించి టామ్ అండ్ జేర్రి ఇంటర్నెట్లో సూపర్ హిట్. ఎలుక-పిల్లి కళ్లు చెదిరే ఆట ఆడడం తరచుగా ప్రజలను నవ్విస్తుంది, అలరిస్తుంది. అయితే ప్రస్తుతం తాజాగా ఓ ఎలుక,పిల్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.పిల్లిని భలేగా ఆటపట్టించింది ఎలుక. అవును మీరు విన్నది నిజమే.. పిల్లి ముందు పడుకుని పోర్లు దండాలు పెడుతున్నట్టుగా రౌండ్లు కొడుతోంది. ఆ ఎలుక కదలికను చూసి పిల్లి కూడా ఆశ్చర్యపోతుంది. ఎలుకను చూసిన పిల్లి ఒక్కసారిగా ఝలక్ తిన్నట్టుగా అవుతుంది. తను ఉన్నచోటు నుండి ఉలిక్కి పడి నుండి లేస్తుంది. కానీ ఎలుకను వేటాడుతుందని అందరూ అనుకుంటున్నారు..కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఎలుక అలా ఎలా చేసిందబ్బా అన్నట్టుగా ఆ పిల్లి బిక్కముఖం వేసుకుని ఇప్పటికీ ఆశ్చర్యపోతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!
Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..
Cris Gaera: బ్రెజిల్ మోడల్‌కి బంపర్ ఆఫర్.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..