Viral Video: మాస్క్ పెట్టుకోమన్నందుకు బ్యాంకు సిబ్బందికి చుక్కలు చూపించిన మిలియనీర్.. వైరల్ వీడియో
ఓ చైనీస్ మిలియనీర్ తన అకౌంట్ ఉన్న బ్యాంకులోకి వెళ్లాడు. అయితే అక్కడున్న సెక్యూరిటీ గార్డు అతన్ని మాస్క్ పెట్టుకోవాలని కోరాడు. నన్నే మాస్కు పెట్టుకోమంటవా అంటూ బ్యాంకులో ఉన్న తన డబ్బును డ్రా చేశాడు. లక్షో, రెండు లక్షలో కాదండి..
ఓ చైనీస్ మిలియనీర్ తన అకౌంట్ ఉన్న బ్యాంకులోకి వెళ్లాడు. అయితే అక్కడున్న సెక్యూరిటీ గార్డు అతన్ని మాస్క్ పెట్టుకోవాలని కోరాడు. నన్నే మాస్కు పెట్టుకోమంటవా అంటూ బ్యాంకులో ఉన్న తన డబ్బును డ్రా చేశాడు. లక్షో, రెండు లక్షలో కాదండి.. ఏకంగా 5 మిలియన్ యువాన్లు విత్ డ్రా చేశాడు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.5.8 కోట్లు. అంతబాగానే ఉందని కానీ డబ్బులో తేడా ఉంది లెక్క పెట్టాలని డిమాండ్ చేశాడు. దీంతో బ్యాంకు సిబ్బంది రోజంతా ఆ డబ్బు లెక్కపెట్టారు. ఇదేం బాధరా నాయిన అనుకుంటూ డబ్బు అతడికి అప్పజెప్పారు.
‘సన్‌వేర్’ అన్ మిలియనీర్ బ్యాంక్ ఆఫ్ షాంఘై బ్రాంచ్‌కు వెళ్లాడు. అతను అక్కడి వెళ్లగానే మాస్క్ పెట్టుకోవాలని భద్రత సిబ్బంది కోరారు. కోపంతో అతడు తన ఖాతా నుంచి 5 మిలియన్ యువాన్ (రూ. 5.8 కోట్లు) నోట్లను తీసుకున్నాడు. అతను డబ్బు తీసుకుని వెళ్లిపోలేదు. డబ్బులో తేడా అనిపిస్తుంది బ్యాంకు సిబ్బంది పైసలను చేతితో లెక్కించాలి డిమాండ్ చేశాడు. సిబ్బంది రోజంతా కష్టపడి డబ్బును లెక్కించి అతనికి ఇచ్చారు. అయితే ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు. ‘రోజుకు ఐదు మిలియన్ల యువాన్ల పరిమితి నిబంధన ఉండటంతో ఈరోజు ఇంతటితో వదిలేశాను. రేపు వచ్చి నా ఖాతా మొత్తం ఖాళీ చేస్తాను’ అని బ్యాంకు సిబ్బందికి వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆ మిలియనీర్. ఇందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒకే కరెన్సీ కౌంటర్‌తో తన నగదు ఉపసంహరణను సిద్ధం చేయడానికి ఇద్దరు బ్యాంక్ కార్మికులకు రెండు గంటలు పట్టిందని బ్యాంకు అధికారి తెలిపారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..