Mayor weads crocodile: మొసలిని పెళ్లి చేసుకున్న మేయర్.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Updated on: Jul 04, 2022 | 9:11 AM

ప్రతి మనిషి జీవితంలో పెళ్లి మధురమైన ఘట్టం. తమ ఆచార, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ పెళ్లి ప్ వేడుకలను ప్రత్యేకంగా చేసుకోవాలని కోరుకుంటారు.


ప్రతి మనిషి జీవితంలో పెళ్లి మధురమైన ఘట్టం. తమ ఆచార, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ పెళ్లి ప్ వేడుకలను ప్రత్యేకంగా చేసుకోవాలని కోరుకుంటారు. అందుకు ప్రజలు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వింత పెళ్లి వార్తల్లో నిలిచింది. ఈ పెళ్లిలో విచిత్రం ఏంటంటే.. వధువుకు బదులు వరుడు మొసలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వింత పెళ్లి మెక్సికోలో జరిగింది. శాన్ పెడ్రో హువామెలులా మేయర్ (Mayor of San Pedro Huamelula) సెటోర్ హ్యూగో (Setor Hugo) ఆచార సాంప్రదాయాలను అనుసరించి.. మొసలిని ఘనంగా వివాహం చేసుకున్నాడు. మొసలిని తెల్లటి పెళ్లి దుస్తులతో, సంప్రదాయబద్దంగా అలంకరించారు. ఆ తరువాత మేయర్ మొసలిని వివాహం చేసుకున్నారు. అనంతరం మేయర్ ఆడ మొసలిని ముద్దు పెట్టుకున్నారు. అయితే ఇలా ముద్దు పెట్టుకునే సమయంలో మొసలి నోరు ఒక గుడ్డతో శుభ్రం చేస్తారు. తద్వారా అది వరుడికి ఏ విధంగానూ హాని కలిగించదు. ఇలా వివాహం చేసుకున్నవారు ఇకనుంచి తమను తాము దైవ పురుషులుగా భావిస్తారు. ఈ వివాహానికి వేలాది మంది హాజరయ్యారు. మెక్సికోలో మొసలిని పెళ్లి చేసుకునే ఆచారం 1789 నాటినుంచి కొనసాగుతోందని చెబుతున్నారు. ఇలా మొసలిని పెళ్లి చేసుకోవడం వల్ల పట్టణం ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉంటుందని అక్కడివారు నమ్ముతారు. ఇక మొదట మొసలి పేరును ప్రస్తావిస్తూ బంధువులకు, స్నేహితులకు వివాహ ఆహ్వానాన్ని పంపుతారు. ఆ తర్వాత అందరి సమక్షంలో వివాహం జరిపిస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 04, 2022 09:11 AM
Follow Us