Shocking insident: వెంట్రుకవాసిలో తప్పించుకోవడం అంటే ఇదేనేమో.. భూమిపై నూకలున్నాయంటున్న నెటిజనం..

|

Aug 11, 2022 | 8:04 AM

మరణం అనేది చాలా బాధాకరమైనది. అది జీవితంలో ఏదో ఒక సమయంలో కచ్చితంగా వస్తుంది. కానీ ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అలాంటి మృత్యువు నుంచి రెప్పపాటు కాలంలో తప్పించుకుంటే..


మరణం అనేది చాలా బాధాకరమైనది. అది జీవితంలో ఏదో ఒక సమయంలో కచ్చితంగా వస్తుంది. కానీ ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అలాంటి మృత్యువు నుంచి రెప్పపాటు కాలంలో తప్పించుకుంటే.. అతనికి భూమిపై నూకలు బాకీ ఉన్నట్లే. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంటాయి. ఇవి భయంతో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. సరిగ్గా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి.. తన కారుపై పడిన మంచును క్లీన్ చేస్తున్నాడు. ఇంతలో పై నుంచి ఏదో పడిపోతున్నట్టు అనిపించి పైకి చూసాడు. వెంటనే అప్రమత్తమై అక్కడి నుంచి పక్కకు జరిగాడు. మరుక్షణమే పై నుంచి పెద్ద వస్తువు దూసుకొచ్చి కారుపై పడుతుంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయిపోయింది. అదే వస్తువు ఆ వ్యక్తిపై పడి ఉంటే అతను ప్రాణాలతో మిగిలేవాడు కాదు. వెన్నులో వణుకు పుట్టించే ఈ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియోలను లక్షలమంది వీక్షించగా వేలాది మంది లైక్ చేశారు. ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. అతనికి భూమిపై నూకలు మిగిలే ఉన్నాయంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us on