Mother- baby: అమ్మకోసం చిన్నారి తపన.. చిట్టిచేతులతో ముద్దుముద్దుగా ఏం చేసిందో చూడండి.. మల్లి మల్లి చూడాలనిపించే వీడియో..

|

Sep 25, 2022 | 9:46 AM

అమ్మ అంటే ప్రేమకు, త్యాగానికి మారుపేరు. తన పిల్లలకోసం తల్లి ఏమైనా చేస్తుంది. అలాంటి అమ్మకోసం ఓ చిన్నారి ఎంతో ప్రేమతో వంట చేసింది. తన చిట్టి చిట్టి చేతులతో కూరగాయలు


అమ్మ అంటే ప్రేమకు, త్యాగానికి మారుపేరు. తన పిల్లలకోసం తల్లి ఏమైనా చేస్తుంది. అలాంటి అమ్మకోసం ఓ చిన్నారి ఎంతో ప్రేమతో వంట చేసింది. తన చిట్టి చిట్టి చేతులతో కూరగాయలు కట్‌చేసి స్పెషల్‌ డిష్‌ తయారు చేసింది. అందుకు సంబంధించి వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ రెండేళ్ల చిన్నారి స్వయంగా కూరగాయలు కట్ చేసింది. వాటిని జాగ్రత్తగా బాయిలర్‌లో పెట్టి ఉడకబెట్టింది. మధ్యలో పనిలో పనిగా ఓ క్యారెట్‌ మొత్తం తిని అది రుచిగా ఉందో లేదో చూసింది. ఆ తర్వాత చికెన్‌ కర్రీ వండింది. చికెన్‌ ముక్కలకు గరం మసాలా పట్టించి వాటిని ఎయిర్ ఫ్రయర్లో వేసింది. ఓ పాకెట్ రైస్‌ను మైక్రోవేవ్‌లో పెట్టి దానికి కాస్త ఆయిల్, యాపిల్ సైడర్ వెనిగర్ యాడ్ చేసింది. ఆ తర్వాత రైస్‌ను ఓ బౌల్‌లోకి తీసుకుంది. చివరకు మొత్తం డిన్నర్‌ను ప్రిపేర్ చేసి టేబుల్‌పై పెట్టింది ఈ పసిపాప. ఆ తర్వత ఆమె తల్లి వచ్చాక.. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఈ డిన్నర్ చాలా రుచిగా ఉందంటూ తల్లి కూతుర్ని మెచ్చుకుని మురిసిపోయింది. చిన్నారి వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతూ.. వావ్‌, అమేజింగ్ అంటూ చిన్నారిని తెగ పొగిడేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us on