Black Magic: అయ్యో ఏంటి ఇలా చేసాడు.. కట్టుకున్న భార్యను చంపేందుకు చేతబడి చేయించిన భర్త..
హైదరాబాద్ పాత బస్తీలో ఒక భర్త తన భార్యను హతమార్చేందుకు ఓ కొత్త ప్లాన్ వేశాడు. నేరుగా చంపేస్తే ఆ మర్డర్ కేసు తన మీదకు వస్తుందని భావించిన ఆ మొగడు.. మరో మార్గం ఆలోచించాడు..
హైదరాబాద్ పాత బస్తీలో ఒక భర్త తన భార్యను హతమార్చేందుకు ఓ కొత్త ప్లాన్ వేశాడు. నేరుగా చంపేస్తే ఆ మర్డర్ కేసు తన మీదకు వస్తుందని భావించిన ఆ మొగడు.. మరో మార్గం ఆలోచించాడు.. అదే చేతబడి.. చేయించాడు. ఇదంతా ఎందుకంటే.. రెండో పెళ్లి చేసుకోవడానికి భార్య అడ్డుపడుతుందన్న ఆక్కసుతోనే కావడం విశేషం. అది కూడా ఎంతో తెలివిగా చేశాడు. ఆమెకు జ్వరంగా ఉండటం తనకు అనువుగా మార్చుకున్నాడీ ఓల్డ్ సిటీ హజ్బెండ్.. వైద్యుడిని పిలవాల్సింది కాస్తా భూత వైద్యుడిని పిలిపించాడు. ఆమె జబ్బు నయం చేయడానికని అతడి చేత మంత్ర తంత్రాలు చేయించాడు. కోడిని కోయించి, రక్తం చిందించి, నిమ్మకాయలను దొర్లించాడు. ఈ తతంగం గురించి తెలిసిన బాధితురాలి సోదరుడు.. హుటాహుటిన తన సోదరి ఇంటికి వచ్చాడు. అక్కడ జరుగుతున్న మాయామంత్రం గుర్తించి.. వెంటనే బాబా చేసే బ్లాక్ మేజిక్‌ను అడ్డుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఇంటిపై దాడి చేసి.. బాబాను అరెస్టు చేశారు. అతడితో పాటు.. ఆ భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు. కొన్నాళ్లుగా ఈ వివాహిత అనారోగ్యం కారణంగా.. బాధ పడుతుంటే.. ఆమెకు కనీసం మందులు, ఆహారం అందించకుండా.. ఈ ఘాతుకానికి పాల్పడ్డం.. ప్రస్తుతం పాతబస్తీలో కలకలం సృష్టిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos