ఇంటర్నెట్లో జంతువులకు సంబంధించిన వీడియోలకు కొదవే ఉండదు. ఇక పెంపుడు జంతువులకు సంబంధించినవి అయితే చెప్పనక్కర్లేదు. వాటి చిలిపి చేష్టలతో నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తుంటాయి. తాజాగా ఓ శునకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.ఈ వీడియోలో ఓ గదిలో ఓ బెడ్, దాని పక్కన ఓ సోఫా ఉన్నాయి. ఆ సోఫాకి ముందు భాగంలో ఓ తెల్లని దిండు వేసి ఉంది. దానిపైన ఓ శునకరాజం ముఖం వరకు దుప్పటి కప్పుకొని పడుకొని ఉంది. ఈ కుక్క..ఓ చిన్న పిల్లాడిలా వెల్లకిలా పడుకుని ఉంది. బెడ్ చాలా బావుంది.. ఓ కునుకు తీద్దాం అనుకుంది. అలా ఆ దిండుపైన పడుకొని తోక ఊపుతూ తెగ ఎంజాయ్ చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. శునక మారాజుగారి రాజసం మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించగా లక్షల్లో లైక్ చేస్తున్నారు. వేలమంది ఫన్నీ కామెంట్లతో రీ ట్వీట్ చేస్తూ హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..