Viral Video: రోడ్డు పక్కన గుబురుగా పెరిగిన చెట్లు తొలగిస్తుండగా.. మట్టి కింద అద్భుతం.. గ్రానైట్ కంటే విలువైన..

|

Aug 17, 2022 | 5:58 PM

కేరళలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కాసర్‌గోడ్‌ మున్సిపాలిటీకి సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న ఓ స్థలంలో చెట్లను నరికివేస్తుండగా పురాతన శివలింగం లభ్యమైంది. కాయూర్ క్లైకోడ్‌లోని వీరభద్ర దేవాలయం సమీపంలోని


కేరళలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కాసర్‌గోడ్‌ మున్సిపాలిటీకి సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న ఓ స్థలంలో చెట్లను నరికివేస్తుండగా పురాతన శివలింగం లభ్యమైంది. కాయూర్ క్లైకోడ్‌లోని వీరభద్ర దేవాలయం సమీపంలోని గుబురుగా పెరిగిన చెట్లను నరికి శుభ్రం చేస్తుండగా శతాబ్దాల నాటి శివలింగం కనిపించింది. శివలింగం దొరికిన మట్టిదిబ్బలో గ్రానైట్ అవశేషాలు కూడా ఉన్నాయి. ఓ వ్యక్తి ఎప్పటినుంచో పట్టించుకోకుండా వదిలేసిన తన స్థలాన్ని తాజాగా శుభ్రపరుస్తుండగా.. మట్టి కింద కప్పి ఉన్న శివలింగం కనిపించిందని స్థానికుడైన గోపాలకృష్ణన్ చెబుతున్నారు. కాగా ఇక్కడ పాతికేళ్ల క్రితం గొప్ప దేవాలయం ఉందనడానికి ఇదే నిదర్శనం కావచ్చని చారిత్రక పరిశోధకులు అంటున్నారు. కన్హంగాడ్ నెహ్రూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల చరిత్ర అధ్యాపకులు నందకుమార్ కోరోత్, సీపీ రాజీవ్ మాట్లాడుతూ.. దొరికిన శివలింగం 1200 ఏళ్ల నాటిదని తెలిపారు. ఈ శివలింగం 8వ శతాబ్దానికి ముందు నిర్మించిన ఆరాధన రూపాలను పోలి ఉందని తెలిపారు. ఆ కాలపు శివలింగాలు నేటితో పోలిస్తే చిన్నవిగా ఉండేవని వెల్లడించారు. కాగా శివలింగం బయల్పడిందన్న వార్త వినగానే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివస్తున్నారు. ఆ ప్రాంతంలో ఓ ఆలయం నిర్మించి పూజలు చేయాలని కోరుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us on