Viral Video: వినాయక భక్తులకు బంపరాఫర్‌.. గణేష్‌ ఊరేగింపులో విచ్చలవిడిగా మద్యం పంపిణీ.. ఎక్కడ అంటే..

|

Sep 11, 2022 | 9:56 AM

దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. చాలా చోట్ల మూడో రోజు నుంచి వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో వివిధ రూపాలలో పూజలందుకుంటున్న


దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. చాలా చోట్ల మూడో రోజు నుంచి వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో వివిధ రూపాలలో పూజలందుకుంటున్న గణనాధుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో వినాయకుని ఊరేగింపు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గేటు సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన వినాయకునికి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు వైసీపీ నేతలు బంపరాఫర్‌ ఇచ్చారు. గణనాధుని ఊరేగింపులో పాల్గొన్న భక్తులకు మద్యాన్ని ప్రసాదంగా పంచారు. ఏకంగా వాటర్‌ ట్యాంకర్‌ నీళ్లు సప్లై చేసినట్లు ట్రాక్టర్ మీద డ్రమ్ము ఏర్పాటు చేసి మద్యం పంపిణీ చేశారు. మరో ట్విస్ట్‌ ఏంటంటే ఏపీ సీఎం జగన్‌ నివాసానికి కూతవేటు దూరంలోనే ఈ బహిరంగ మద్యం పంపిణీ జరగడం విశేషం. పోలీసుల సమక్షంలో విజయవంతంగా భక్తులకు మద్యం పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Follow us on