Bear Video: కారు అద్దాలు పగలగొట్టి ఎలుగు ఏం చేసిందో తెలుసా.? చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
రోజెల్ ఇంటి అవసరాల కోసం షాపునుంచి కొన్ని సోడాలు తెచ్చుకుంది. వాటిని కారులోనే మర్చిపోయింది. ఇక కుక్క అరుపులతో బాల్కనీలోకి వచ్చి చూసిన రోజెల్‌కు తన కారువద్ద ఒక పెద్ద ఎలుగుబంటి కనిపించింది. అది తన కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న
కెనడాకు చెందిన షరోన్ రోజెల్ అనే మహిళ తెల్లవారు జామున కుక్క ఏకధాటిగా మొరుగుతూ ఉంటే ఏం జరిగిందా అని మహిళ బయటకు వచ్చి చుట్టూ పరిశీలించింది. అంతే అక్కడ జరుగుతున్న సీన్ చూసి ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే తన మొబైల్ తీసుకొని వచ్చి అక్కడ జరుగుతున్నదృశ్యాన్ని తన కెమెరాలో బంధించి, ఆపైన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఏం జరగిందంటే.. రోజెల్ ఇంటి అవసరాల కోసం షాపునుంచి కొన్ని సోడాలు తెచ్చుకుంది. వాటిని కారులోనే మర్చిపోయింది. ఇక కుక్క అరుపులతో బాల్కనీలోకి వచ్చి చూసిన రోజెల్‌కు తన కారువద్ద ఒక పెద్ద ఎలుగుబంటి కనిపించింది. అది తన కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న సోడాలు మొత్తం తాగేసింది. తను ఇంటి కోసం 70 క్యాన్ల సోడాలు తెచ్చుకుంటే.. మొత్తం ఊదిపాడేసింది ఆ ఎలుగుబంటి. సాధారణంగా అడవి జంతువులు ఆహారం కోసమో, నీళ్ల కోసమో జనావాసాల్లోకి వస్తుంటాయి. ఈ ఎలుగుబంటి కూడా అలాగే వచ్చిఉంటుంది. దాహం వేయడంతో నీళ్లు కనిపించక అక్కడ సోడా టేస్ట్ చేసింది. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక ఎలుగు బంటి ఆ స్థాయిలో సోడాలు తాగడం అత్యంత అరుదు అని కొందరు వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!