మీ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ సురక్షితమేనా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!

Updated on: Aug 02, 2026 | 12:44 PM

లిఫ్ట్ ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, మూవింగ్ వాక్స్‌కు ప్రత్యేక చట్టం తీసుకురానుంది. క్రమం తప్పకుండా నిర్వహణ, అర్హత కలిగిన టెక్నీషియన్లతో సర్వీసింగ్, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానంపై అవగాహన పెంపు ద్వారా ప్రమాదాలను తగ్గించాలని అధికారులు సూచిస్తున్నారు. చిన్నారులను లిఫ్ట్‌లో ఒంటరిగా పంపొద్దని కూడా హెచ్చరిస్తున్నారు.

ఈమధ్య కాలంలో అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలతో పాటు సొంతిళ్లలోనూ లిఫ్ట్‌ల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే సరైన నిర్వహణ లేకపోవడంతో తరచుగా ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల శ్రీకాకుళంలో లిఫ్ట్ క్యాబిన్ రాకుండానే తలుపులు తెరుచుకోవడంతో ఓ వ్యాపారి కిందపడి మృతిచెందగా, హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో చైన్ తెగిపోయి ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ తరహా ప్రమాదాల అడ్డుకట్టకు తెలంగాణ ప్రభుత్వం ‘లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, మూవింగ్ వాక్స్ ముసాయిదా బిల్లు’ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. లిఫ్ట్ సరిగ్గా పనిచేయాలంటే నిరంతర నిర్వహణ అత్యంత కీలకం. క్యాబిన్ అంతస్తు వద్దకు వచ్చినప్పుడు మాగ్నెట్ సంకేతాల ద్వారా మదర్ బోర్డు స్పందించి డోర్ తెరుచుకుంటుంది. మాగ్నెట్లు లేదా మదర్ బోర్డులో సాంకేతిక సమస్యలు వచ్చినా, బ్రేక్‌లు విఫలమైనా లిఫ్ట్ మధ్యలో ఆగడం, వేగంగా కిందకు పడిపోవడం వంటివి జరుగుతాయి. చాలామంది లిఫ్ట్ పాడైనప్పుడే టెక్నీషియన్‌ను పిలుస్తుంటారు. కానీ నెలకోసారి ముందస్తుగా చెక్ చేయించడం చాలా మేలు. విడిభాగాలతో కలిపి ఏడాదికి రూ. 12 వేల నుంచి రూ. 50 వేల వరకు నిర్వహణ ఖర్చు ఉంటుంది. అనుభవం లేని వ్యక్తులతో సర్వీసింగ్ చేయించడం వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమై ప్రమాదాలకు దారితీస్తున్నాయి. కాబట్టి అర్హత, నైపుణ్యం ఉన్న టెక్నీషియన్లతోనే క్రమం తప్పకుండా మరమ్మతులు చేయించాలి. విద్యుత్ అంతరాయం లేదా సాంకేతిక లోపం వచ్చినప్పుడు లిఫ్ట్‌ను మాన్యువల్‌గా ఎలా ఆపాలి, డోర్లు ఎలా తెరవాలనే దానిపై వాచ్‌మెన్ లేదా ఇళ్ల యజమానులకు అవగాహన ఉండాలి. ముఖ్యంగా గ్రిల్ తలుపులు ఉన్న చోట 5 నుంచి 10 ఏళ్ల పిల్లలను ఒంటరిగా పంపకుండా పెద్దల సంరక్షణలోనే తీసుకెళ్లడం అత్యంత సురక్షితం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉదయాన్నే టీ తాగుతున్నారా? ఇది తెలిస్తే ఇక టీ జోలికి వెళ్లరు

అరే.. ఇదేం చేప.. ప్లేస్‌ను బట్టి రంగు మార్చేస్తోంది!

Loading...
Unable to load recommendations.
Follow Us