ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన

Updated on: Oct 06, 2026 | 12:50 PM

తెలంగాణలో మహిళలకు విజయవంతంగా అమలవుతున్న మహాలక్ష్మి ఉచిత బస్సు పథకాన్ని పురుష వృద్ధులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే లక్షలాది మంది సీనియర్ సిటిజన్లకు ఆర్థిక భారం తగ్గుతుంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు, బాలికలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ పథకం విజయవంతం కావడంతో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. తాజాగా, పురుష వృద్ధులకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ఆలోచనలో ఉన్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. సమాజానికి ఎంతో సేవ చేసిన వృద్ధుల ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, వారికి ఉచిత బస్సు పాస్ వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ సదుపాయం ఉండగా, వృద్ధుల నుంచి కూడా రాయితీలు కల్పించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సిద్ధం చేసింది.ఒకవేళ ఇది అమల్లోకి వస్తే, ఆర్థికంగా వెనుకబడిన, ఒంటరిగా జీవించే వృద్ధులకు, ముఖ్యంగా వైద్య సేవలు పొందడానికి ప్రయాణించే వారికి ఇది పెద్ద ఉపశమనం అవుతుంది. ప్రయాణ ఖర్చులు తగ్గడంతో పాటు, వృద్ధులు ఇతరులపై ఆధారపడకుండా తమ పనులను పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం :

ఒకే నెలలో రెండు సినిమాలతో సందడి చేస్తున్న సాయి పల్లవి

కన్‌ఫ్యూజన్‌లో కన్నడ హీరోలు..ఎందుకంటే?

బాలీవుడ్‌లో సినిమా తీయటం అంత ఈజీ కాదన్న అజయ్‌ దేవగన్‌

ఆకతాయిలకు జూనియర్ వార్నింగ్‌… ఎవ్వరినీ వదిలిపెట్టనన్న ఎన్టీఆర్‌..

రణబాలి కథ రివీల్ చేసిన దర్శకుడు!

Loading...
Unable to load recommendations.
Follow Us