బీటలు వారిన భూమి రక్షణ కవచం.. సౌర తుపాన్ల ప్రభావంపై శాస్త్రవేత్తల షాకింగ్ నిజాలు!

Updated on: Nov 10, 2026 | 4:31 PM

భారీ సౌర తుపాన్ల ప్రభావంతో భూమి చుట్టూ ఉండే వాన్‌ అలెన్‌ రేడియేషన్‌ బెల్టుల్లో మార్పులు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 2024 మేలో సంభవించిన G5 సౌర తుపాను సమయంలో శక్తిమంతమైన ఎలక్ట్రాన్లు లోపలి బెల్ట్‌లోకి చొచ్చుకెళ్లాయి. దాదాపు 3 మెగా ఎలక్ట్రాన్‌ వోల్ట్ల శక్తి ఉన్న కిల్లర్‌ ఎలక్ట్రాన్ల సంఖ్య 5,000 రెట్లు పెరిగినట్లు అరసే ఉపగ్రహం నమోదు చేసింది.

భూమి చుట్టూ రక్షణ వలయంలా ఉండే సహజ రేడియేషన్ కవచం ‘వాన్ అలెన్ బెల్ట్’‌కు భారీ సౌర తుపాన్ల వల్ల బీటలు పడుతున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గ్రహం చుట్టూ ఉన్న అంతరిక్షాన్ని శక్తిమంతమైన కణాల నుంచి భూమి అయస్కాంత క్షేత్రం ఎలా కాపాడుతుందనే దానిపై ఇప్పటివరకు ఉన్న అవగాహనను ఈ ఆవిష్కరణ పూర్తిగా మార్చివేసింది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ప్రముఖ జర్నల్ ‘జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్’‌లో ప్రచురితమయ్యాయి. భూమి చుట్టూ రెండు డోనట్ ఆకారపు ప్రాంతాలలో వాన్ అలెన్ రేడియేషన్ బెల్టులు విస్తరించి ఉన్నాయి. లోపలి బెల్ట్ ఒక అభేద్యమైన కవచంలా పనిచేస్తూ, ‘కిల్లర్ ఎలక్ట్రాన్లు’ అని పిలిచే అత్యంత శక్తివంతమైన కణాలను భూమికి దగ్గరగా రాకుండా అడ్డుకుంటుందని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు నమ్ముతూ వచ్చారు. అయితే, 2024 మే నెలలో సంభవించిన అత్యంత శక్తిమంతమైన G5 కేటగిరీ సౌర తుపాను ఈ నమ్మకాన్ని తలకిందులు చేసింది. ఆ సమయంలో అత్యంత శక్తిమంతమైన ఎలక్ట్రాన్లు రక్షిత ప్రాంతంగా భావిస్తున్న లోపలి బెల్ట్‌లోకి చొచ్చుకెళ్లినట్లు జపాన్‌కు చెందిన ‘అరసే’ శాటిలైట్ రికార్డ్ చేసింది. సూర్యుడి నుంచి వచ్చిన కరోనల్ మాస్ ఎజెక్షన్‌ల కారణంగా భూమి చుట్టూ ఉన్న ప్లాస్మాస్పియర్‌లో చల్లని ప్లాస్మా పరిమాణం తగ్గి, ‘కోరస్ వేవ్స్’ ఏర్పడ్డాయి. దీనివల్ల దాదాపు మూడు మెగాఎలక్ట్రాన్‌వోల్ట్‌ల శక్తి ఉన్న ఎలక్ట్రాన్‌ల సంఖ్య ఏకంగా 5,000 రెట్లు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణించే ఈ కిల్లర్ ఎలక్ట్రాన్లు శాటిలైట్ల రక్షణ కవచాలను ఛేదించి, సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలను దెబ్బతీసే ప్రమాముంది. అంతేకాకుండా అంతరిక్షంలోని వ్యోమగాములకు కూడా ఇది తీవ్ర రేడియేషన్ ముప్పును తెచ్చిపెడుతుంది. నగోయా విశ్వవిద్యాలయ స్పేస్ ఫిజిసిస్ట్ యోషిజుమి మియోషి నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధన.. భవిష్యత్తులో అంతరిక్ష వాతావరణాన్ని అంచనా వేయడానికి, శాటిలైట్లు మరియు వ్యోమగాముల భద్రతను కాపాడుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐపీఎల్ 2027లో ఊహించని మలుపు.. పంజాబ్‌కు హార్దిక్, ముంబయికి అర్ష్‌దీప్

కిలాడీ లేడీలు.. మాటల్లో పెట్టి మాయం చేసారు

హాయిగా నిద్రపోండి.. లక్షలు సంపాదించండి

ఆర్టీసీ – మెట్రో ఉమ్మడి పాస్‌ ధర భారీగా తగ్గింపు

నిరుద్యోగ యువతకు.. గుడ్‌న్యూస్‌

Loading...
Unable to load recommendations.
Follow Us