భూమి పై భారీ ఉల్కాపాతం..! ఆ జీవరాశుల అంతానికి, దీనికి సంబంధమేంటి?
అమెరికాలోని ఓక్లహామాలో ఉన్న ఏమ్స్ ఉల్కాపాతం క్రేటర్ వయసును శాస్త్రవేత్తలు సవరించారు. గతంలో 46.7 కోట్ల ఏళ్ల వయసు అని భావించగా, తాజా పరిశోధనలో ఇది 36.97 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడినట్లు తేలింది. ఉల్కాపాతం వేడికి కరిగిన రాళ్లలోని జిర్కాన్ స్ఫటికాలపై యురేనియం-లెడ్ డేటింగ్ ద్వారా ఈ వయసును గుర్తించారు. దీంతో ఈ ఘటన సముద్ర జీవరాశి భారీగా నశించిన కాలానికి చాలా దగ్గరగా జరిగినట్లు వెల్లడైంది.
అమెరికాలోని ఓక్లహామాలో ఉన్న ఏమ్స్ ఉల్కాపాతం క్రేటర్ వయసును శాస్త్రవేత్తలు సవరించారు. గతంలో భావించినట్లుగా ఇది 46.7 కోట్ల ఏళ్ల క్రితం కాకుండా, సుమారు 37 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిందని టెక్సాస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తేల్చారు. అంటే, ఇప్పటివరకు ఉన్న అంచనా కంటే దీని వయసు దాదాపు 10 కోట్ల సంవత్సరాలు తక్కువ. ఈ కొత్త ఆవిష్కరణతో, భూమిపై భారీస్థాయిలో జీవరాశులు అంతరించిన కాలానికి ఈ ఉల్కాపాత సంఘటన దగ్గరగా జరిగినట్లు తెలుస్తోంది. ఓక్లహామాలోని భూమి పొరల్లో కొన్ని మైళ్ల వెడల్పున ఈ బిలం విస్తరించి ఉంది. అక్కడ లభించిన పురాతన జీవుల దంతాల అవశేషాల ఆధారంగా గతంలో శాస్త్రవేత్తలు దీని వయసును లెక్కించారు. అయితే, ఎలిజబెత్ క్యాట్లాస్ నేతృత్వంలోని ఆధునిక పరిశోధక బృందం, ఉల్కాపాతం వేడికి కరిగిన రాళ్లలోని జిర్కాన్ స్ఫటికాలపై అత్యంత ఖచ్చితమైన ‘యురేనియం-లెడ్ డేటింగ్’ పద్ధతిని ఉపయోగించి సరికొత్త వయసును కనుగొంది. ఉల్కాపాతం జరిగినప్పుడు, అక్కడ అంతకుముందే ఉన్న పాత శిలల్లోని శిలాజాలు బిలంలో కలిసిపోవడం వల్లే మునుపటి అంచనాలు తప్పుగా వచ్చాయని సైంటిస్టులు వెల్లడించారు. తాజా పరిశోధన ప్రకారం ఈ బిలం వయసు 36.97 కోట్ల సంవత్సరాలుగా తేలింది. ఈ కాలక్రమం ప్రకారం, సుమారు 37.2 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై సముద్ర జీవరాశి భారీ స్థాయిలో నాశనమైన తీవ్ర విపత్తు సమయానికి ఈ ఉల్కాపాతం చాలా దగ్గరగా జరిగింది. ఈ ఉల్కాపాతమే జీవరాశి వినాశనానికి ప్రధాన కారణమని ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, ఆ విపత్కర కాలంలోనే ఇది సంభవించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరిన్ని నమూనాలను పరిశోధిస్తే ఈ కొత్త వివరాలు మరింత స్పష్టమవుతాయని పరిశోధకులు వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దృశ్యం సినిమా తరహాలో తండ్రిని చంపేసాడు.. చివరికి
శివాలయంలో అద్భుత దృశ్యం..శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
Rakul Preet Singh: మీరు అనుకుంటున్నట్టు నాకు ఎవరూ గిఫ్ట్‌లు.. విల్లాలు ఇవ్వలేదు!
Janhvi Kapoor: ఆ నీచులు చేసింది లైగిక వేధింపులకు తక్కువేం కాదు
Srikanth Odela: సుకుమార్ ఇంటి చుట్టూ మూడేళ్లు పిచ్చోడిలా తిరిగా..
