ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!

Updated on: Oct 03, 2026 | 6:19 PM

ఇకపై మొబైల్‌లో లైవ్‌ టీవీ చూడాలంటే ఇంటర్నెట్‌ డేటా లేదా వైఫై తప్పనిసరి కాకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్‌-టు-మొబైల్‌ (D2M) సాంకేతికతను వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు చేపడుతోంది. ఈ టెక్నాలజీ ద్వారా బ్రాడ్‌కాస్ట్‌ సిగ్నల్స్‌తో నేరుగా ఫోన్లకు టీవీ ప్రసారాలు చేరుతాయి. మారుమూల, గిరిజన ప్రాంతాల్లో ఇది ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. అయితే ప్రత్యేక హార్డ్‌వేర్‌ అవసరం ప్రధాన సవాలుగా ఉంది.

మొబైల్ ఫోన్‌లో లైవ్ టీవీ ఛానల్స్ లేదా వీడియోలు చూడాలంటే ఇంటర్నెట్ డేటా లేదా వైఫై కనెక్షన్ తప్పనిసరి. కానీ ఇకపై ఆ అవసరం లేకుండానే నేరుగా మొబైల్‌లోనే టీవీ ప్రసారాలను చూడొచ్చు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ‘డైరెక్ట్-టు-మొబైల్’ (D2M) అనే విప్లవాత్మక సాంకేతికతను వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చేందుకు వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ టెక్నాలజీ ద్వారా సిమ్ కార్డ్ లేదా డేటా లేకపోయినా సరే ఫోన్లలో లైవ్ టీవీ చూడవచ్చు. D2M అనేది బ్రాడ్‌కాస్టింగ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ సాంకేతికతల కలయికతో పనిచేస్తుంది. ఎఫ్‌‌ఎమ్ రేడియో తరంగాల మాదిరిగానే, ఎలాంటి ఇంటర్నెట్ లేకుండానే మల్టీమీడియా కంటెంట్‌ను నేరుగా ఫోన్లకు ప్రసారం చేస్తుంది. సిగ్నల్స్ సరిగా లేని గిరిజన, అటవీ మరియు మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది ఎంతగానో ప్రయోజనకరంగా మారనుంది. ఈ ప్రాజెక్టును ప్రసార భారతి, ఐఐటీ కాన్పూర్ మరియు తేజస్ నెట్‌వర్క్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇప్పటికే దేశంలోని 19 నగరాల్లో దీని ట్రయల్స్ విజయవంతమయ్యాయి. వాణిజ్యపరమైన అమలు కోసం ఈ ఏడాది అక్టోబర్‌లో ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’ జారీ చేయనున్నారు. 470-582 MHz స్పెక్ట్రమ్ బ్యాండ్‌లో ఈ ప్రసారాలు సాగుతాయి కాబట్టి సెల్యులార్ నెట్‌వర్క్‌లకు ఎలాంటి అంతరాయం కలగదు. ఈ టెక్నాలజీ వినియోగానికి ఫోన్లలో ATSC 3.0 ప్రమాణాలకు అనుగుణమైన ప్రత్యేక హార్డ్‌వేర్ ఉండాలి. ప్రస్తుతం వాడుకలో ఉన్న స్మార్ట్‌ఫోన్లలో ఇది లేకపోవడం ప్రధాన సవాలు. మరోవైపు ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే తమ డేటా రీఛార్జ్ ఆదాయం తగ్గుతుందని టెలికాం కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ఏది ఏమైనా, D2M అందుబాటులోకి వస్తే డిజిటల్ ప్రసార రంగంలో పెద్ద విప్లవమే రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏనుగునైనా చంపే కింగ్‌ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో చూస్తే షాక్!

హైటెక్ సిటీ స్టేషన్‌లో 10 రైళ్లకు హాల్ట్! ఇక ఆఫీస్ నుంచి నేరుగా మీ సొంతూరికి

Ba Ba Black Sheep: పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు చేస్తుంది

Loading...
Unable to load recommendations.
Follow Us