భూమి వేడెక్కుతున్నా చలి తగ్గలేదెందుకు? వాతావరణంలో విచిత్రమైన మార్పులకు కారణమేంటి?

Updated on: Nov 16, 2026 | 7:14 PM

భూమి అంతటా ఒకేరీతిలో వేడెక్కుతుందనే అపోహను తాజా అధ్యయనాలు పటాపంచలు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాలలో మాత్రం చలి తీవ్రత పెరుగుతోంది. ప్రాంతీయ వాతావరణ పరిస్థితులు, ఏరోసాల్స్, వృక్ష సంపదలో మార్పులు ఈ విపరీత వ్యత్యాసాలకు ప్రధాన కారణం.

భూమి వేడెక్కుతోందనే మాట సర్వసాధారణం. అయితే, చాలామంది భూమి అంతటా ఒకేరీతిలో వేడెక్కుతుందని భావిస్తారు. వాతావరణ శాస్త్రవేత్తల తాజా అధ్యయనాలు ఈ అపోహను పూర్తిగా తొలగించాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాలలో మాత్రం ఇందుకు విరుద్ధంగా చలి తీవ్రత పెరుగుతోంది. వాతావరణ పరిస్థితులు, ఎండ, మేఘాలు, గాలి, తేమ వంటి అంశాలు ప్రతి ప్రాంతంలోనూ భిన్నంగా ఉండటమే ఈ విపరీత మార్పులకు ప్రధాన కారణం. కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం 2002 నుంచి 2021 మధ్యకాలంలో సుమారు 1400 నగరాల నుంచి శాటిలైట్ డేటాను సేకరించారు. ఈ పరిశోధన ప్రకారం, దాదాపు 86 శాతం నగరాల్లో పగటిపూట వేడి పెరిగినట్లు స్పష్టమైంది. అదే విధంగా 96 శాతం నగరాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. అయితే, పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గిన నగరాలు కేవలం 3.9 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. 2024 జనవరి నెలలో ఈ ప్రాంతీయ వ్యత్యాసాలు మరింత స్పష్టంగా కనిపించాయి. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా నమోదైనా, ఉత్తరార్ధ గోళంలోని కొన్ని ప్రాంతాలను తీవ్రమైన చలి వణికించింది. ఫిన్లాండ్‌లో -31.5 డిగ్రీలు, సైబీరియాలో -40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈశాన్య చైనా, భారతదేశంలో కూడా పగటి ఉష్ణోగ్రతల పెరుగుదల చాలా తక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడానికి గాలిలో పెరుగుతున్న ఏరోసాల్ సాంద్రత, వృక్ష సంపదలో వస్తున్న మార్పులే కారణమని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్యను గొలుసులతో బంధించి..! భర్త చేసిన దారుణాన్ని చూస్తే షాక్! అసలేం జరిగింది?

ఇద్దరు తండ్రులు.. రెండు కన్నీటి కథలు.. ఒకరి కూతురి మందులు.. మరొకరి కుటుంబం ఆకలి

హైదరాబాద్ నెంబర్ 1.. ఢిల్లీ, బెంగళూరుది బ్యాక్ బెంచ్.. అసలు నిజమేంటి?

ప్రేమ కాదు.. పిచ్చి! రూ.7 కోట్లతో రూ.4,500 కోట్ల వండర్!

శీతాకాలంలో సంపూర్ణ ఆరోగ్యం.. తప్పక తీసుకోవాల్సిన పోషకాహారాలు ఇవే

Loading...
Unable to load recommendations.
Follow Us