Viral: అయ్యయ్యో.! తాగిపడేసిన బీర్ టిన్‌లో దూరిన పాము.. ఆ తర్వాత జరిగిందిదే

Edited By:

Updated on: Aug 16, 2024 | 4:44 PM

జగిత్యాల జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొడిమ్యాల మండలం నల్లగొండ శివారులోని రైతు వేదిక మైదానంలో మందుబాబులు తాగిపడేసిన బీర్‌ టిన్‌లో పాము దూరడానికి యత్నించింది.

జగిత్యాల జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొడిమ్యాల మండలం నల్లగొండ శివారులోని రైతు వేదిక మైదానంలో మందుబాబులు తాగిపడేసిన బీర్‌ టిన్‌లో పాము దూరడానికి యత్నించింది. ఈ క్రమంలో తల ఇరుక్కుపోయి బయటికి రాలేక తల్లడిల్లింది. మూడు గంటల పాటు అటూ ఇటూ తిరిగింది. స్థానికులు తీసే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. చివరకు పాము ముళ్లకంపలో నుంచి వెళ్తుండగా టిన్‌ ఊడిపోవడంతో బతుకుజీవుడా.. అంటూ పారిపోయింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us