Sapota: బాగా పండిన సపోటాలు తింటే ఏమవుతుందో తెలుసా ?? ఈ వీడియో తప్పక చూడండి

Updated on: Feb 12, 2026 | 12:33 PM

సపోటాలో ఎ, బి, సి, ఇ విటమిన్లు, కాల్షియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఎముకలను దృఢంగా మార్చి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్దకం, వాపు సమస్యలను తగ్గిస్తుంది. తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే, బాగా పండిన సపోటాలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా మేరకు, పరిమితంగా తీసుకోవాలి. బరువు పెరిగే అవకాశం కూడా ఉంది.

సపోటాలో అనేక రకాల విటమిన్స్‌, మినరల్స్‌ ఉంటాయి. వీటిని ఆరోగ్య వంతులు తరచూ తీసుకోవచ్చు.ఈ ఫ్రూట్స్‌లో ఎ,బి,సి,ఇ విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్‌, పోషకాలు ఉంటాయి. వీటిలో పైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయని ఇంటర్నేషనల్‌ సైంటిఫిక్‌ జర్నల్స్‌ తేల్చాయి. గుండె ఆరోగ్యానికి సపోటా ఎంతగానో దోహదపడుతుంది. మలబద్దకం, కడుపు ఉబ్బరం, డయేరియా వంటి సమస్యలు తగ్గుతాయి. సపోటా సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. శరీరంలోని వాపు, ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. ఇందులోని పొటాషియం రక్తపోటును అదుపు చేస్తుంది. ఇందులోని సహజ చక్కెరలు ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌ ఉంటాయి. వీటివల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. వ్యాయామం చేసేవారికి, గర్భిణిలకు మంచిది. బాగా పండిన సపోటా ఎక్కువ తీపిని కలిగి ఉంటుంది. వాటిలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువ. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. బాగా పండిన సపోటాల్లో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. బాగా పండిన సపోటాలు తీసుకుంటే బరువు పెరిగి ఇబ్బందులు వస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి శరీరంలో చక్కెర స్థాయిలను బట్టి సపోటాను తినొచ్చు. అయితే వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balakrishna: బాలయ్య దెబ్బ.. కుర్ర హీరోలు అందరూ అబ్బా..

Ram Charan: ఓ పక్క రూ.కోట్లు.. ఇంకో పక్క ఇచ్చిన మాట.. సందిగ్ధంలో చరణ్

Dhurandhar: ధురంధర్ ఎఫెక్ట్‌.. హీరోకు తీవ్రవాదుల ధమ్కీ

Ustaad Bhagat Singh: తెలంగాణలో పవన్‌ సినిమాకు.. టికెట్ రేట్స్‌ పరేషాన్

Published on: Feb 12, 2026 12:29 PM
Loading...
Unable to load recommendations.
Follow Us