ఊరిస్తున్న ఒక్క పాట.. పెద్ది టీమ్ ప్లానేంటి?
ప్రెజెంట్ కమర్షియల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తప్పనిసరి. రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం ప్లాన్ చేసిన క్రేజీ స్పెషల్ సాంగ్ షూటింగ్ మాత్రం నెలల తరబడి ఆలస్యమవుతోంది. మృణాల్ ఠాకూర్, సంయుక్త మీనన్ పేర్లు తెరపైకి రాగా, హీరోయిన్ విషయంలో జాప్యమా లేక దర్శకుడు బుచ్చిబాబు భారీగా ప్లాన్ చేస్తున్నారా అనేది ఆసక్తిగా మారింది.
ప్రస్తుత కమర్షియల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తప్పనిసరి అంశంగా మారాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రాలకు స్టార్ హీరోయిన్ల స్పెషల్ సాంగ్స్ అదనపు హైప్‌ను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కోసం ఒక క్రేజీ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ పాట విషయంలో నెలల తరబడి చర్చలు జరుగుతున్నా, ఇప్పటివరకు చిత్రీకరణ మొదలుకాలేదు. ఈ ఆలస్యానికి కారణం ఏమిటనేది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్పెషల్ సాంగ్‌లో చరణ్‌తో కలిసి ఆడిపాడబోయే నటి ఎవరు అనే దానిపై స్పష్టత కొరవడింది. గతంలో మృణాల్ ఠాకూర్ పేరు గట్టిగా వినిపించగా, ప్రస్తుతం సంయుక్త మీనన్ పేరు తెరపైకి వచ్చింది.
Loading...
Unable to load recommendations.
Follow Us
