45 లక్షల కట్నం, బంగారం ఇచ్చినా తీరని దాహం.. వరకట్న వేధింపులకు నవవధువు బలి
పూణేలో పెళ్లైన నాలుగు నెలలకే ఓ మహిళా ఐటీ ఇంజినీర్ మృతిచెందిన ఘటన విషాదం నింపింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తింటివారు వేధించారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి సమయంలో రూ.45 లక్షల నగదు, 116.64 గ్రాముల బంగారం ఇచ్చినప్పటికీ కొత్త కారు కోసం మరో రూ.5 లక్షలు తీసుకురావాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భర్త, మామ, అత్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాలం మారుతున్నా..మనుషుల్లో మాత్రం మార్పు రావడంలేదు. టెక్నాలజీ యుగంలో పురుషులతో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో సత్తా చాటుతున్నారు. అయినా కట్నం అనే మహమ్మారికి కొందరు అబలలు బలైపోతున్నారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తింటివారు పెట్టిన మానసిక, శారీరక వేధింపులు తాళలేక పెళ్లయిన నాలుగు నెలలకే ఓ మహిళా ఐటీ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన పూణేలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూణేలోని వడాచివాడి ప్రాంతంలో నివాసముంటున్న వైష్ణవి ఓంకార్ గిస్రే గురువారం రాత్రి తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలి తండ్రి ప్రవీణ్ రఘునాథ్ జరండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. వైష్ణవికి ఓంకార్ సంజయ్ గిస్రేతో ఈ ఏడాది మే 9న ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి సమయంలో సుమారు రూ. 45 లక్షల నగదుతో పాటు 116.64 గ్రాముల బంగారాన్ని కట్నంగా సమర్పించారు. అయితే, పెళ్లయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. కొత్త కారు కొనుగోలు చేయడానికి పుట్టింటి నుంచి మరో రూ. 5 లక్షలు తీసుకురావాలని భర్త, అత్తింటివారు ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని, ప్రతిరోజూ శారీరకంగా, మానసికంగా వేధించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. వైష్ణవి భర్త ఓంకార్ గిస్రే, మామ సంజయ్ గిస్రే , అత్త రూపాలి గిస్రే లపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Urvashi Rautela: AI సంస్థకి హీరోయిన్ ఝలక్.. రూ.7000 కోట్లు డిమాండ్
ఈబీ-5 గ్రీన్‌కార్డు ఫీజులపై ‘డబుల్’ షాక్.. భారతీయులపై ఎఫెక్ట్
మళ్లీ దగ్గరవుతోన్న భారత్-చైనా
ఉదయాన్నే మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. తిరిగి చూడగా గుండె గుభేల్
