Rabi Crops: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు!
2027–28 రబీ మార్కెటింగ్ సీజన్‌కు ఆరు ప్రధాన రబీ పంటల కనీస మద్దతు ధరలను కేంద్ర కేబినెట్ పెంచింది. కుసుమకు క్వింటాల్‌పై రూ.675, ఆవాలు రూ.413, మసూర్ రూ.390, బార్లీ రూ.136, శనగ రూ.83, గోధుమకు రూ.25 చొప్పున పెంపు ప్రకటించింది. దీంతో కుసుమ MSP రూ.7,215, ఆవాలు రూ.6,613, మసూర్ రూ.7,390, బార్లీ రూ.2,286, శనగ రూ.5,958, గోధుమ రూ.2,610కు చేరాయి.
దేశంలోని రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2027–28 రబీ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ప్రధానమైన ఆరు రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు పంట ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం నికర లాభం దక్కేలా ఈ నూతన మద్దతు ధరలను ఖరారు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ చేసిన సిఫార్సుల మేరకు ఉత్పత్తి ఖర్చులు, మార్కెట్లో డిమాండ్-సరఫరా పరిస్థితులు మరియు ఆర్థికాంశాలను సమగ్రంగా పరిశీలించిన పిమ్మట ఈ ధరలను నిర్ణయించారు. రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్థితిని పటిష్టం చేయడంతో పాటు, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. రబీ పంటల్లో కుసుమ మద్దతు ధరను అత్యధికంగా క్వింటాల్‌పై రూ.675 పెంచారు. దీంతో క్వింటాల్ కుసుమ ధర రూ.7,215లకు చేరింది. ఆ తర్వాత ఆవాలకు రూ.413 పెంపు ప్రకటించారు. దీంతో క్వింటాల్ ఆవాల ధర రూ.6,613కు చేరింది. మసూర్ పప్పుకు రూ.390 పెంపుతో రూ. 7,390, బార్లీకి రూ.136 పెంపుతో రూ. 2,286 చేరింది. శనగకు రూ.83 పెంచడంతో క్వింటాల్ ధర రూ. 5,958 పలుకుతోంది. గోధుమకు రూ.25 మద్దతుధర పెంచడంతో క్వింటాల్ రూ. రూ. 2,610 లకు చేరింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రబీ సీజన్‌లో సాగు చేపట్టే రైతులకు ఎంతో ఊరటనిస్తుందని, దీనివల్ల దేశంలో పప్పుదినుసులు, నూనెగింజల సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుందని వ్యవసాయ రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
45 లక్షల కట్నం, బంగారం ఇచ్చినా తీరని దాహం.. వరకట్న వేధింపులకు నవవధువు బలి
Urvashi Rautela: AI సంస్థకి హీరోయిన్ ఝలక్.. రూ.7000 కోట్లు డిమాండ్
ఈబీ-5 గ్రీన్‌కార్డు ఫీజులపై ‘డబుల్’ షాక్.. భారతీయులపై ఎఫెక్ట్
మళ్లీ దగ్గరవుతోన్న భారత్-చైనా
ఉదయాన్నే మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. తిరిగి చూడగా గుండె గుభేల్
