RS.2 crore For Haircut Video: హెయిర్‌కట్‌లో పొరపాటు..రూ.2 కోట్లు నష్టపరిహారం..! వైరల్ గా మారిన వీడియో
దేశరాజధానిలోని ఓ పెద్ద హోటల్ కు జాతీయ వినియోగదారుల ఫోరం శిక్ష విధించింది. ఒక మోడల్ జుట్టును సరిగా కట్ చేయకపోవడం పై శిక్ష విధించింది. సదరు మోడల్ కు రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని జరిమానా విధించింది.
దేశరాజధానిలోని ఓ పెద్ద హోటల్ కు జాతీయ వినియోగదారుల ఫోరం శిక్ష విధించింది. ఒక మోడల్ జుట్టును సరిగా కట్ చేయకపోవడం పై శిక్ష విధించింది. సదరు మోడల్ కు రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని జరిమానా విధించింది. ఈ మేరకు ఎన్.సి.డి.ఆర్.సి ఆదేశించింది.ఒక ప్రముఖ మోడల్ తన హెయిర్ స్టైల్ కోసం..ఢిల్లీలోని స్టార్ హోటల్‌కు సంబంధించిన బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది…హెయిర్ కట్ చేయించునే క్రమంలో ఆమె జుట్టు చాలా డ్యామేజ్ అయ్యిందట…దీంతో ఆమె వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే… తాను జట్టును కోల్పోయాని ఫిర్యాదు చేసింది. తాను ప్రముఖ కంపెనీలకు మోడల్ నని, తనకు కేశాలే జీవనాధారం అని, వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాని తెలిపింది. జుట్టు పొడవుగా ఉన్నందునే తనకు మోడలింగ్ రంగంలో అవకాశాలు ఎక్కువగా వచ్చాయని, వస్తున్నాయని చెప్పింది..తను చెప్పిన సూచనల మేరకు..హెయిర్ స్టైల్ చేయకుండా…హోటల్ సిబ్బంది ఇష్టాను సారం చేశారని ఆరోపించింది. మోడలింగ్ లో ఎదగాలనుకున్న…తన కలలు నీరుగారి పోయాయని ఆవేదన వ్యక్తం చేసింది.
బాధితురాలి ఫిర్యాదును స్వికరించిన ఎన్.సి.డి.ఆర్.సి హోటల్ యాజమాన్యం నుంచి వివరణ కోరింది. హోటల్ యాజమాన్యం తన తప్పును అంగీకరించింది. దీంతో ఎన్.సి.డి.ఆర్.సి ఆ హోటల్ కు శిక్ష విధించింది. ఫిర్యాదు చేసిన మోడల్ కు రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Bihar court: కోర్ట్ ఆర్డర్: ఊరి ఆడవాళ్లందరి బట్టలు ఉతికి ఐరన్ చేయాలి.. వింత పనిష్మెంట్ (వీడియో వైరల్)