బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్ దృశ్యాలు.. ఇది ఎయిర్‌పోర్టా.. రైల్వేస్టేషనా!
బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2లో ప్రయాణికులు నేలపై, బెంచీలపై నిద్రిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు దీనిని క్రమశిక్షణ లోపంగా విమర్శిస్తుండగా, మరికొందరు విమానాల ఆలస్యాలు, ఖరీదైన లాంజ్‌లు, విశ్రాంతి సదుపాయాల కొరత కారణంగానే ప్రయాణికులు ఇలా చేయాల్సి వస్తోందని వాదిస్తున్నారు. ఈ ఘటన విమానాశ్రయాల్లో ప్రయాణికుల సౌకర్యాలపై చర్చకు దారితీసింది.
దేశంలోనే అత్యంత అందమైన, ఆధునికమైన విమానాశ్రయంగా పేరొందిన బెంగళూరు ‘కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2 ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టెర్మినల్ లోపల ప్రయాణికులు ఇష్టారాజ్యంగా బెంచీలపై, ఇండోర్ మొక్కల కింద, నేలపై బ్యాగులను దిండ్లుగా చేసుకుని నిద్రిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ కావడమే ఇందుకు కారణం. ఓ డిజిటల్ క్రియేటర్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. “ఎంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కట్టినా.. మేము దేశీయులముగానే ఉంటాము” అని క్యాప్షన్ ఇవ్వడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం నెటిజన్లు ప్రపంచ స్థాయి సౌకర్యాలున్న చోట ఇలా ప్రవర్తించడం పౌర బాధ్యత లేకపోవడమేనని, ఎయిర్‌పోర్ట్ అందాన్ని పాడు చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే మెజారిటీ నెటిజన్లు మాత్రం ప్రయాణికులకే మద్దతుగా నిలుస్తున్నారు. “విమానాలు గంటల తరబడి ఆలస్యమైనప్పుడు, కనెక్టింగ్ ఫ్లైట్ల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చినప్పుడు ప్రయాణికులు ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి? టిక్కెట్లకు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నప్పుడు పడుకోవడానికి సరైన సీట్లు ఎందుకు ఇవ్వడం లేదు?” అని విమానాశ్రయ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. సింగపూర్, కొరియా వంటి అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లలో కూడా ఇలా పడుకోవడం సాధారణమేనని గుర్తు చేస్తున్నారు. ఈ వీడియో విమానాశ్రయాల్లో మౌలిక వసతుల కొరతను వెలుగులోకి తీసుకువస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లో లాంజ్‌లు, స్లీపింగ్ పాడ్స్ ఉన్నప్పటికీ.. అవి సాధారణ ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు అందుబాటులో లేనంత ఖరీదైనవిగా ఉంటున్నాయి. అందుకే సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విమానాశ్రయాల విస్తరణ కేవలం అందానికే కాకుండా, ప్రయాణికుల కనీస అవసరాలను తీర్చేలా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
130 అడుగుల ఎత్తునుంచి పడినా బ్రతికే ఉంది.. కన్నీరు పెట్టిస్తున్న నర్స్ మాటలు !
భారీ ట్రాక్టర్‌ను తన రెక్కలతో ఆపేసిన పక్షి..! గుడ్ల రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టిన మాతృప్రేమ
ఒక సాధారణ వెల్డర్.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు!
