హోటల్ బిల్లు కట్టలేదు.. రోడ్డున పడ్డ పాక్ హాకీ జట్టు
ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ హాకీ జట్టుకి ఘోర అవమానం ఎదురైంది. నిధుల కొరత, హాకీ సమాఖ్య నిర్వాకంతో ప్లేయర్లు గంటల తరబడి రోడ్డుపైనే వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. హోటల్ బిల్లు చెల్లించకపోవడంతో యాజమాన్యం బుకింగ్‌ను రద్దు చేసింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ హాకీ జట్టు కాన్‌బెర్రాకు చేరుకుంది. అయితే, ప్లేయర్లు బస చేయాల్సిన ఫోర్ స్టార్ హోటల్‌కు పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ డబ్బులు కట్టలేదు. దీంతో హోటల్ యాజమాన్యం వారి బుకింగ్ క్యాన్సిల్ చేసింది. ఈ విషయం తెలియని ఆటగాళ్లు, అధికారులు హోటల్‌కు చేరుకుని, తమకు గదులు లేవని తెలిసి షాకయ్యారు.
పరిస్థితిని చక్కదిద్దేందుకు జట్టు హెడ్ కోచ్ తాహిర్ జమాన్ పాకిస్థాన్ స్పోర్ట్స్ బోర్డ్ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గంటల తరబడి రోడ్డుపైనే వేచి చూసిన తర్వాత హోటల్ యాజమాన్యంతో మాట్లాడటంతో వారు కొన్ని గదులను కేటాయించారు. దీంతో ఒకే గదిలో ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు సర్దుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి, జట్టు వసతి కోసం పీఎస్‌బీ ఇప్పటికే 49,000 డాలర్ల నిధులను విడుదల చేసినట్లు సమాచారం. అయినప్పటికీ బిల్లు చెల్లించకపోవడం ఫెడరేషన్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ గందరగోళం జరిగిన మరుసటి రోజే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు 2-3 తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌లలోనూ పాకిస్థాన్ ఓడిపోయింది.
మరిన్ని వీడియోల కోసం :
రామ్ చరణ్, ఉపాసన కవలల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!
బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!
బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!
