హెయిర్‌కట్ తర్వాత ఆ మసాజ్ చేయిస్తున్నారా? ప్రాణాలకే ప్రమాదం!
హెయిర్‌కట్ తర్వాత మెడను తిప్పుతూ ‘కట్.. కట్’ అనే శబ్దం వచ్చేలా మసాజ్ చేయించుకోవడం చాలామందికి అలవాటు. అయితే మెడను ఒక్కసారిగా బలంగా తిప్పే విధానాల వల్ల అరుదుగా రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వెర్టీబ్రల్ ఆర్టరీకి గాయం జరిగితే స్ట్రోక్ ముప్పు ఉండొచ్చు. మసాజ్ తర్వాత తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, తిమ్మిర్లు లేదా మాట తడబడటం కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
హెయిర్‌కట్ అయిపోయింది.. ఇక మెడ మసాజ్! కాసేపు అలా మెడను తిప్పి ‘కట్.. కట్’ అనే శబ్దం వచ్చేలా చేస్తే ఏదో రిలీఫ్ వచ్చినట్లు అనిపిస్తుంది. చాలామంది దీన్ని హెయిర్‌కట్‌లో భాగంగానే భావిస్తారు. కానీ అలా మెడను ఒక్కసారిగా వేగంగా తిప్పడం వల్ల ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉందని న్యూరోసర్జన్లు హెచ్చరిస్తున్నారు. మెడను ఒక్కసారిగా బలంగా తిప్పడం వల్ల రక్తనాళాలు, నరాలు, వెన్నుపూసకు తీవ్ర గాయాలు కావచ్చని చెబుతున్నారు. మన మెడ భాగంలో మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ‘వెర్టీబ్రల్ ఆర్టరీలు’ ఉంటాయి. మెడను బలంగా తిప్పినప్పుడు ఈ రక్తనాళాల గోడలు దెబ్బతిని రక్తం గడ్డకట్టవచ్చు. ఆ రక్తం మెదడుకు సరఫరా కాకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా శ్వాస వ్యవస్థకు సహాయపడే ‘ఫ్రెనిక్ నరం’ దెబ్బతింటే శ్వాస తీసుకోవడం కష్టమై వెంటిలేటర్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు. ఎముకల బలహీనత, డిస్క్ సమస్యలు ఉన్నవారికి ఈ ప్రమాదం మరీ ఎక్కువ. మసాజ్ తర్వాత తీవ్రమైన తలనొప్పి, మెడనొప్పి, ఒళ్లు తిమ్మిర్లు ఎక్కడం, మాట తడబడటం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్ట్రోక్ చికిత్స ఉన్న ఆస్పత్రికి వెళ్లాలి. కాబట్టి హెయిర్‌కట్ చేసుకునేటప్పుడు జుట్టు కత్తిరింపు వరకే పరిమితమై, మెడ తిప్పే మసాజ్‌లను పూర్తిగా నివారించడం శ్రేయస్కరం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Fauji: డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సాలిడ్ టీజర్ వస్తోంది!
The Paradise Collection: దిమ్మతిరిగే కలెక్షన్స్.. నాని కెరీర్‌లో ఫాస్టెస్ట్ రూ.100CR!
Avengers Endgame Encore: ఎండ్‌గేమ్ ఎన్‌కోర్ దెబ్బకు.. మన బాహుబలి రికార్డ్ గల్లంతు!
