Karwa Chauth Gift: కర్వా చౌత్‌ సందర్భంగా భార్యకు గోవిందా.. అదిరిపోయే గిఫ్ట్‌..! నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో..

Updated on: Oct 31, 2021 | 8:43 PM

దీపావళికి పది రోజులు ముందు వచ్చే కర్వా చౌత్‌… పండగను ఉత్తరాది ప్రజలు ఎంతో వేడుకగా జరుపుకొంటారు. ఈ పండగను పురస్కరించుకుని మహిళలు తమ జీవిత భాగస్వామి క్షేమంగా ఉండాలని కోరుతూ ఉపవాస దీక్ష చేస్తారు.


దీపావళికి పది రోజులు ముందు వచ్చే కర్వా చౌత్‌… పండగను ఉత్తరాది ప్రజలు ఎంతో వేడుకగా జరుపుకొంటారు. ఈ పండగను పురస్కరించుకుని మహిళలు తమ జీవిత భాగస్వామి క్షేమంగా ఉండాలని కోరుతూ ఉపవాస దీక్ష చేస్తారు. తమ భర్త ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని, కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక పెళ్లికాని అమ్మాయిలైతే తమకు మంచి భర్త రావాలని పూజలు చేస్తారు. ఈ ఏడాది కూడా ఉత్తరాది ప్రజలతో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ ఫెస్టివల్‌ను ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు.

‘కర్వా చౌత్‌’ పండుగ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు గోవిందా తన సతీమణి సునీతకు ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందించారు. ‘నా ప్రాణ స్నేహితురాలు..నా జీవిత భాగస్వామి…నా ఇద్దరు అందమైన పిల్లలకు తల్లివి అయిన నీపై నాకున్న ప్రేమ వెలకట్టలేనిది. అయినా మా అందరి క్షేమం కోరి నీవు ఆచరించే కర్వాచౌత్‌ సందర్భంగా ఒక చిన్న బహుమతిని నీకు అందిస్తున్నాను’ అంటూ కారును గిఫ్ట్‌గా తన భార్యకు అందించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు గోవిందా. ఆయనతో పాటు అమితాబ్‌ బచ్చన్‌, శిల్పాశెట్టి, యామీ గౌతమ్‌, వరుణ్‌ ధావన్‌, పంకజ్‌ త్రిపాఠి, మీరా కపూర్‌, కపిల్‌ శర్మ తదితరులు తమ సెలబ్రేషన్స్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మరి వాటిపై ఓ లుక్కేసి, వారి ఆనందాన్ని మీరూ పాలుపంచుకోండి..

మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Vijay Sethupathi Bike Photos: BMW బైక్ కొన్న ‘మక్కల్ సెల్వన్’.. స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ‘విజయ్ సేతుపతి’.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Loading...
Unable to load recommendations.
Follow Us