wats app users: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ మరో మూడు కొత్త ఫీచర్లు.. ఎలా అంటే..

|

Aug 18, 2022 | 8:37 AM

మెసేజింగ్ యాప్‌ అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చేది వాట్సాప్‌. అంతలా యూజర్లను అట్రాక్ట్‌ చేసిందీ యాప్‌. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్‌ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుందని


మెసేజింగ్ యాప్‌ అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చేది వాట్సాప్‌. అంతలా యూజర్లను అట్రాక్ట్‌ చేసిందీ యాప్‌. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్‌ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్‌. వాట్సాప్‌ ఇటీవల వరుస పెట్టి కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్‌ టీమ్‌.వాట్సాప్‌ మరో మూడు కొత్త ఫీచర్లను యాడ్‌ చేస్తున్నట్లు మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. ఏదైనా గ్రూప్‌ నుంచి నిష్క్రమిస్తే ఇతర సభ్యులకు ఎవరికీ తెలియదు. ఎగ్జిట్‌ అయిన విషయం అడ్మిన్స్‌కు మాత్రమే తెలుస్తుంది. అలాగే వాట్సాప్‌ను ప్రైవేట్‌గా చూసుకునే వెసులుబాటు కూడా రానుంది. ఈ కొత్త ఫీచర్స్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎవరికి కనపడాలి, ఎవరికి కనపడకూడదో నిర్ణయించుకోవచ్చు. ఈ రెండు ఫీచర్లు ఆగస్ట్‌లోనే యాడ్‌ చేయనున్నట్లు కంపెనీ ఆగస్టు 9న ప్రకటించింది. ఒక యూజర్‌ మరో యూజర్‌కు వ్యూ వన్స్‌ ఫీచర్‌ను ఉపయోగించి ఫోటో, వీడియో పంపినప్పుడు ఒకసారి మాత్రమే చూసుకునే వీలుంది. అయితే వ్యూ వన్స్‌ ద్వారా వచ్చిన ఫొటోకానీ, వీడియోకానీ స్క్రీన్‌షాట్‌ తీసుకునే అవకాశం ఉండదు. అతి త్వరలో ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us on